Share News

‘రిజర్వేషన్‌ శాతం పెంచడం హర్షణీయం’

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:14 AM

క్రీడల్లో రాణించే క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించేలా సీఎం చంద్రబాబు క్రీడా రిజర్వేషన్లను 2శాతం నుంచి 3శాతానికి పెంచడం హర్షణీయమని టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెట్టి వేణుగోపాల్‌, అబ్దుల్లాపురం బాషా అన్నారు.

 ‘రిజర్వేషన్‌ శాతం పెంచడం హర్షణీయం’
సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బుడ్డా చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

ఆత్మకూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): క్రీడల్లో రాణించే క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించేలా సీఎం చంద్రబాబు క్రీడా రిజర్వేషన్లను 2శాతం నుంచి 3శాతానికి పెంచడం హర్షణీయమని టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెట్టి వేణుగోపాల్‌, అబ్దుల్లాపురం బాషా అన్నారు. క్రీడా రిజర్వేషన్లతో పాటు క్రీడల్లో వివిధ పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇవ్వబోవు ఉద్యోగ, నగదు నజరానాలను స్వాగతిస్తూ మంగళవారం ఆత్మకూరు స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి సాగిన ఈ ర్యాలీ గౌడ్‌ సెంటర్‌కు చేరగా అక్కడ మానవహారంగా ఏర్పడి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ క్లబ్‌ చైర్మన్‌ పస్పీల్‌ మున్నా, సభ్యులు ఆసీఫ్‌ బేగ్‌, షఫివుల్లా, సయ్యద్‌ అసదుల్లా, పీఈటీలు దేవానంద్‌, రామ్‌ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 12:14 AM