కార్తీకమాసం ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Nov 15 , 2024 | 01:32 AM
శ్రీశైలంలో కార్తీమాసం ఏర్పాట్లను ఇన్‌చార్జి ఈవో ఇ. చంద్రశేఖరరెడ్డి గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.
శ్రీశైలం, నవంబరు 14(ఆంధ్రజోతి): శ్రీశైలంలో కార్తీమాసం ఏర్పాట్లను ఇన్‌చార్జి ఈవో ఇ. చంద్రశేఖరరెడ్డి గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయంలోని క్యూలైన్లు, లడ్డుప్రసాదాల తయారీ, ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం-పుష్కరిణిహారతి ఏర్పాట్లు, పాతాళగంగ వద్ద ఏర్పాట్ల, క్షేత్రపరిధిలోని పార్కింగ్ ప్రదేశాలు మొదలైనవాటిని పరిశీలించారు. ఇన్‌చార్జి ఈవో మాట్లాడుతూ కార్తీకమాసంలో సోవారాలు, కార్తీక పౌర్ణమి రోజులలో స్వామి, అమ్మవార్లకు నిర్వహించే కైంకర్యాలు, పుష్కరిణికి హారతి, లక్ష దీపోత్సవం కార్యక్రమాలు పూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించాలని సంబంధిత విభాగానికి సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పుష్కరిణి వద్ద స్వామి, అమ్మవార్లకు పూజాధికాలు నిర్వహించే వేదికను విశాలంగా ఏర్పాటు చేయాలని, లైటింగ్, విద్యుత్ దీపాలంకణ, సుందరీకణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాతాళగంగలో అధిక సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సదుపాయాలలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. అలాగే క్షేత్ర ప్రదేశాలన్నీ పరిశుభ్రంగా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలనిసంబంధిత అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశాలలో తగినంత లైటింగ్, చూచిక బోర్డులు స్పష్టంగా ఉండేల చూడాలన్నారు. పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. నరసింహారెడి, ఎఈవో మల్లికార్జునరెడ్డి, జి. స్వాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.