Srisailam: వైభవంగా మహాకుంభాబిషేకం క్రతువులు, ప్రత్యేక పూజలు ప్రారంభం..
ABN , Publish Date - Feb 21 , 2024 | 07:21 AM
మహాకుంభాబిషేకం క్రతువులు ప్రత్యేక పూజలు శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు ఆలయంలో యాగాలు, హోమాలతో వేదపండితుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిస్వామి, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ, పండిరాధ్యులు కాశీ పీఠాధిపతి మల్లికార్జునమహాస్వామి మహాకుంభాబిషేకం పూజలలో పాల్గొనేందుకు శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు.
నంద్యాల: మహాకుంభాబిషేకం క్రతువులు ప్రత్యేక పూజలు శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు ఆలయంలో యాగాలు, హోమాలతో వేదపండితుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిస్వామి, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ, పండిరాధ్యులు కాశీ పీఠాధిపతి మల్లికార్జునమహాస్వామి మహాకుంభాబిషేకం పూజలలో పాల్గొనేందుకు శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు.
ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9:45 ఉభయ దేవాలయాల గర్భాలయ విమాన గోపురాలకు మూలామూర్తులకు.. దేవతామూర్తులకు శాస్త్రోక్తంగా మహాకుంభాబిషేకం నిర్వహించనున్నారు. మహాకుంభాబిషేకం పూజలలో మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. మహాకుంభాబిషేకం పూజల సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవార్ల దర్శనాలను ఈఓ పెద్దిరాజు తాత్కాలికంగా నిలిపివేశారు. మహాకుంభాబిషేకం వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శ్రీశైలం మారుమోగుతోంది.