అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Aug 31 , 2024 | 01:06 AM
నంద్యాల పట్టణంలో వెలసిన అమ్మవార్లకు భక్తిశ్రద్దలతో శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
నంద్యాల (కల్చరల్), ఆగస్టు 30: నంద్యాల పట్టణంలో వెలసిన అమ్మవార్లకు భక్తిశ్రద్దలతో శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. చివరి శుక్రవారం పురష్కరించుకొని కాళికాంబ చంద్రశేఖరస్వామి దేవస్థానంలోని కాళికాంబ అమ్మవారికి, టెక్కెలో వెలసిన సుంకులా పరమేశ్వరీదేవికి, ఆత్మకూరు బస్టాండువద్ద గల నిమిషాంబదేవి అమ్మవారికి, బస్టాండు దగ్గరలో వెలసిన చౌడేశ్వరీ అమ్మవారికి ఉదయం నుంచి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు నిర్వహించి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కాళికాంబ ఆలయ ఈవో లక్ష్మీనారాయణ, ఆరవేటి వాసు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
నంద్యాలకు చెందిన ఆరవేటి వాసు తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం 30 తులాల బంగారు పాదుకలు దాదాపు రూ.22లక్షల విలువ చేసే బంగారు పాదుకలను కాళికాంబ ఆలయ ఈవో లక్ష్మీనారాయణకు అందజేశారు. వాటిని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.