Share News

‘పది’ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి: డీఈవో

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:45 AM

ప్రణాళికాబద్ధంగా పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు.

‘పది’ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి: డీఈవో
హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో

నందికొట్కూరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రణాళికాబద్ధంగా పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. నందికొట్కూరు పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, సంతపేటలోని ఉర్దూ బాలికల పాఠశాలలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ పాఠశాలలకు మంజూరు అయినటువంటి తరగతి గదుల భవన నిర్మాణం పనులను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ఈ సారి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలని అందుకు తగిన విధంగా యాక్షన్‌ ప్లాన్‌ను వివరించారు. అనంతరం మద్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నందికొట్కూరు మండల విద్యాశాఖ అధికారి సుభాన్‌ హాజరయ్యారు.

డీఈవోకు విద్యార్థి సంఘాల ఫిర్యాదు

పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత పది రోజులుగా కోడిగుడ్లు మాయమవుతున్నాయని ఆంధ్ర విద్యార్థి సంఘం, ప్రగతిశీల విద్యార్థి సమాఖ్య నాయకులు డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులతో మాట్లాడి సమస్య గురించి తెలుసుకొని పరిష్కరిస్తామని డీఈవో విద్యార్థి సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. డీఈవోకు వినతిపత్రం సమర్పించిన వారిలో విద్యార్థి సంఘం నాయకులు నాగరాజు, కుమార్‌ మహేష్‌, రాజు, విక్రమ్‌, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:45 AM