Share News

టీడీపీ సభ్యత్వ సంఖ్యను పెంచాలి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 30 , 2024 | 11:32 PM

టీడీపీ సభ్యత్వ సంఖ్యను పెంచాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సూచించారు.

టీడీపీ సభ్యత్వ సంఖ్యను పెంచాలి: ఎమ్మెల్యే
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ సంఖ్యను పెంచాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సూచించారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు, విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ టీడీపీ అభివృద్ధిలో కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. పాణ ్యం నియోజకవర్గంలో ప్రస్తుతం 70 వేల నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నెలలోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. సభ్యత్వ నమోదుతో ఎంతో ఉపనయోగం ఉందన్నారు. ప్రమాద బీమా రూ.5 లక్షలు వర్తిస్తుందని, అంత్యక్రియ ఖర్చు కోసం రూ. 10 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాలలో గాయపడిన వ్యక్తులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స చేయించుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ జయరామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పాములపాడు: ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని టీడీపీ మండల నాయకుడు ఆళగడ్డ హరిసర్వోత్తమరావు సూచించారు. పాములపాడులో స్థానిక టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు బుధవారం సభ్యత్వం నమోదు చేయించారు. ఆయన మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. టీడీపీ నాయకులు షేక్‌ నబిరసూల్‌, మద్దిలేటి, మట్టికార్జున, లింగస్వామి, జలాల్‌బాషా, మల్లికార్జున, రామకృష్ణ, మన్నెం పుల్లయ్య, ధర్మయ్య కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

పగిడ్యాల: మండలంలోని నెహ్రూనగర్‌ గ్రామంలో బుధవారం టీడీపీ సభ్యత సమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు లోకానందరెడ్డి, రామిరెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌, నాగరాజు, ఆశోక్‌ తదితరులు ఉన్నారు.

కొత్తపల్లి: మండలంలోని ఎర్రమటం గ్రామంలో టీడీపీ నాయకుడు చంద్రమౌళీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్‌ ఇన్‌చార్జిలు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో బూత్‌ ఇన్‌చార్జిలు పరమేశ్వరరెడ్డి, శేఖర్‌, నాయకులు రామిరెడ్డి, మీసాల శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 11:32 PM