Share News

Karnati Venkateswara Rao : నా కుటుంబాన్ని విక్రాంత్‌ రెడ్డి బెదిరించారు

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:33 AM

కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌ వాటాల బదిలీ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి తనను..

Karnati Venkateswara Rao : నా కుటుంబాన్ని విక్రాంత్‌ రెడ్డి బెదిరించారు

  • ముందస్తు బెయిల్‌ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం

  • ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన కేవీరావు

అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌ వాటాల బదిలీ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి తనను, తన కుటుంబ సభ్యులను బెదిరించారని ఫిర్యాదుదారు కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీరావు) హైకోర్టుకు నివేదించారు. వాటాల బదిలీ వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయామని, మానసిక క్షోభ అనుభవించామని పేర్కొన్నారు. విక్రాంత్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో ప్రతివాదిగా చేర్చుకొని తన వాదనలు కూడా వినాలని కేవీ రావు సోమవారం ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వాటాల అక్రమ బదిలీ వ్యవహారంలో క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తు పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు.

Updated Date - Dec 24 , 2024 | 06:33 AM