Share News

Lokesh : వాట్సాప్‌లోనే ఇక సర్టిఫికెట్లు

ABN , Publish Date - Oct 23 , 2024 | 04:25 AM

ఏటా కులం, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాట్సాప్‌ ద్వారానే వాటిని పొందే విధానం ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది.

Lokesh : వాట్సాప్‌లోనే ఇక సర్టిఫికెట్లు
Nara Lokesh

  • వాట్సాప్‌లోనే వాట్సాప్‌లోనే ఇక సర్టిఫికెట్లు

  • మంత్రి లోకేశ్‌ సమక్షంలో మెటాతో ఎంఓయూ

  • ‘యువగళం’ హామీని నిలబెట్టుకున్న మంత్రి

  • ధ్రువీకరణ పత్రాలు, బిల్లుల చెల్లింపు,

  • ఈ-గవర్నెన్స్‌ సేవలు అందించనున్న మెటా

యువగళం పాదయాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం పడుతున్న కష్టాలను గమనించాను. మొబైల్‌లోనే వాటిని అందిస్తామని ఆనాడు హామీ ఇచ్చాను. మాట ఇచ్చిన ప్రకారం.. వాట్సా్‌పలోనే సర్టిఫికెట్లు, పౌరసేవలు పొందేలా మెటాతో ఒప్పందం చేసుకున్నాం.

- మంత్రి లోకేశ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏటా కులం, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాట్సాప్‌ ద్వారానే వాటిని పొందే విధానం ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. వివిధ రకాల బిల్లులు కూడా వాట్సాప్‌ ద్వారానే చెల్లించవచ్చు. ప్రజలకు ప్రభుత్వం నుంచి పౌర సేవలు వాట్సాప్‌ బిజినెస్‌ ద్వారా అందించేందుకు ఈ మేరకు మెటా అంగీకరించింది.


మంత్రి నారా లోకేశ్‌ చొరవతో మెటా ఈదిశగా నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలోని వన్‌ జన్‌పథ్‌లో మంత్రి లోకేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంధ్యా దేవనాథ న్‌, డైరెక్టర్‌ రవి గార్గ్‌, డైరెక్టర్‌(పబ్లిక్‌ పాలసీ) నటాషా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐఏఎస్‌ అధికారులు యువరాజ్‌, ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్‌ పాల్గొన్నారు. ఏఐ ద్వారా మరిన్ని పౌరసేవలు అందించేలా ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. మెటా ప్లాట్‌ఫాం వాట్సాప్‌ బిజినెస్‌ ద్వారా ఇకపై కులం, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు వేగంగా, సులభంగా పొందేందుకు వీలు కలుగుతుంది. కాగా, మెటాతో ఎంఓయూను చరిత్రాత్మక మైలురాయిగా మంత్రి లోకేశ్‌ అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంధ్యా దేవనాథన్‌ ప్రకటించారు.


విద్యార్థులకు త్వరలో శుభవార్త: లోకేశ్‌

విద్యార్థులకు త్వరలోనే శుభవార్త చెబుతామని మంత్రి లోకేశ్‌ మంగళవారం ఎక్స్‌లో ప్రకటించారు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టి వైసీపీ ప్రభుత్వం మిమ్మ ల్ని మోసం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి కేబినెట్‌ సహచరులతో చర్చిస్తాను. త్వరలోనే శుభవార్త వింటారని మీకు హామీ ఇస్తున్నా. మీకు అండగా ఉంటా’ అని అన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 09:48 AM