Share News

Tirupati Laddu Row: సీబీఐ దర్యాప్తు జరపాల్సిందే.. తిరుమల లడ్డూ వ్యవహారంపై మాధవిలత కంటతడి

ABN , Publish Date - Sep 20 , 2024 | 06:45 PM

తిరుమల లడ్డూ వ్యవహారంపై(Tirupati Laddu Row) బీజేపీ సీనియర్ నేత మాధవి లత(Madhavi Latha) స్పందించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ఆమె శుక్రవారం మాట్లాడారు. తిరుపతి ప్రసాదం విషయంలో ఇలా జరగడంపై భావోద్వేగానికి గురయ్యారు.

Tirupati Laddu Row: సీబీఐ దర్యాప్తు జరపాల్సిందే.. తిరుమల లడ్డూ వ్యవహారంపై మాధవిలత కంటతడి

హైదరాబాద్: తిరుమల లడ్డూ వ్యవహారంపై(Tirupati Laddu Row) బీజేపీ సీనియర్ నేత మాధవి లత(Madhavi Latha) స్పందించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ఆమె శుక్రవారం మాట్లాడారు. తిరుపతి ప్రసాదం విషయంలో ఇలా జరగడంపై భావోద్వేగానికి గురయ్యారు. లడ్డూను అపవిత్రం చేసిన వారిపై దర్యాప్తు జరపాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. త్వరలో సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడతానని ఆమె స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా హిందూ సమాజమంతా కదిలి రావాలని కోరారు.

" చంద్రబాబు హయాంలో ఈ విషయం బయట పడటం అభినందనీయం. పార్టీలు ఏవైనా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రం కావడం అనేది గుండె తరుక్కుపోయేలా చేసింది. దీన్ని ఉద్యమంలా తీసుకొని హైందవ ధర్మాన్ని కాపాడటానికి టీటీడీని సందర్శిస్తాం. చంద్రబాబుకు త్వరలో నేను వ్యక్తిగతంగా లేఖ రాస్తా. అవకాశం ఉంటే ప్రధాని మోదీని, అమిత్ షాను కలిసి కారకులపై చర్యలు తీసుకోవాలని కోరతా. ఇది రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడే అంశం కాదు"అని మాధవిలత పేర్కొన్నారు.


ట్రెండింగ్‌లో తిరుమల ట్యాగ్స్..

సీఎం చంద్రబాబు కామెంట్స్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. తిరుపతికి సంబంధించిన ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. సీఎం జగన్ సర్కార్ నిర్లక్ష్యం, కావాలని చేసిన కుట్రే తిరుపతి లడ్డూలు అపవిత్రమవడానికి కారణమయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ సహా.. వైసీపీ మినహా ఇతర పక్షాలన్నీ జగన్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. తిరుమల కొండపై అన్యమత ప్రార్థనలు జరుగుతున్నట్లు టీడీపీ నేతలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. తాజాగా వైసీపీ పాల్పడిన దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తుండటంతో ఆ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు.

Tirumala Laddu: తిరుమల లడ్డూలకు వాడుతున్న నెయ్యేంటి.. సరఫరా చేస్తున్నదెవరు

Updated Date - Sep 20 , 2024 | 06:55 PM