Share News

Earthquakes : ప్రకాశం జిల్లాలో మూడోరోజూ భూప్రకంపనలు

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:14 AM

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మూడో రోజూ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.

Earthquakes : ప్రకాశం జిల్లాలో మూడోరోజూ భూప్రకంపనలు

ముండ్లమూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మూడో రోజూ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సోమవారం ఉదయం 10.24 గంటలకు రెండు సెకన్లపాటు భూమి కంపించింది. మరలా సాయంత్రం 8.15 గంటలకు సెకన్‌పాటు, 8.19 గంటలకు రెండు సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయి. ఈప్రభావం ముండ్లమూరు, వేంపాడు, శంకరాపురం, సింగనపాలెంలో కనిపించింది.

Updated Date - Dec 24 , 2024 | 06:14 AM