Minister: మంచి రోజు చూసుకుని రండి..
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:33 AM
కళంకిత కార్పొరేటర్లను పక్కన పెట్టి, తక్కినవారిని పార్టీలో చేర్చుకునేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్(in-charge minister Anagani Satya Prasad) తెలిపినట్టు తెలిసింది. మంచి రోజు చూసుకుని పార్టీలో చేరేందుకు రావాలని సూచించినట్లు సమాచారం.
- కళంకిత కార్పొరేటర్లను పక్కన పెట్టండి
- టీడీఆర్ స్కాం, భూ కబ్జాలు, కూటమి నేతలపై దౌర్జన్యాలు చేసిన నేతలొద్దు
- ఇన్‌చార్జి మంత్రి అనగాని సూచన
తిరుపతి: కళంకిత కార్పొరేటర్లను పక్కన పెట్టి, తక్కినవారిని పార్టీలో చేర్చుకునేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్(in-charge minister Anagani Satya Prasad) తెలిపినట్టు తెలిసింది. మంచి రోజు చూసుకుని పార్టీలో చేరేందుకు రావాలని సూచించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల చట్ట సవరణ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరేందుకు బీసీ నేత అన్నా రామచంద్రయ్య, వైసీపీ సీనియర్ నేత దొడ్డారెడ్డి సిద్దారెడ్డి నేతృత్వంలో ఇటీవల 10 మందికి పైగా కార్పొరేటర్లు విజయవాడ(Vijayawada)కు వెళ్లి ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసిన విషయం తెలిసిందే.
ఈ వార్తను కూడా చదవండి: Tirupati: తిరుపతిలో కలకలం.. ప్రియుడ్ని కిడ్నాప్ చేయించింది..
తిరుపతికి వచ్చినప్పుడు పార్టీలోకి చేరేందుకు సన్నాహాలు చేసుకోమని మంత్రి చెప్పిన నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దిశానిర్థేశం చేసినట్టు సమాచారం. టీడీఆర్ బాండ్ల కుంభకోణం, భూకబ్జాలు, కూటమి నేతలపై దౌర్జన్యాలు చేసిన వైసీపీ నేతలను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినట్లు తెలియవచ్చింది.
పార్టీ అధిష్ఠానం ఇప్పటికే పలువురు కార్పొరేటర్ల గురించి ఆరాతీసిందని, వారిపై సానుకూలమైన నివేదిక వచ్చిందన్న చర్చ జరిగినట్టు సమాచారం. అలాంటివాళ్లను పార్టీలోకి తీసుకునే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది.
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..
ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!
ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్ ఫ్యాక్టరీ పూర్తి
ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్, కేటీఆర్‌లది నా స్థాయి కాదు
Read Latest Telangana News and National News