Botsa Satyanarayana: వైసీపీ ఇన్‌ఛార్జుల ఐదో లిస్ట్‌ని ప్రకటించిన మంత్రి బొత్స
ABN , Publish Date - Jan 31 , 2024 | 10:24 PM
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన పార్టీలన్నీ తమతమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్ రెడ్డి అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే ఛాన్స్ ఇస్తామని చెప్పినట్టుగానే.. అభ్యర్థులను మార్చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన పార్టీలన్నీ తమతమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్ రెడ్డి అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే ఛాన్స్ ఇస్తామని చెప్పినట్టుగానే.. అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌ఛార్జుల జాబితాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా బుధవారం నాడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి వైసీపీ ఇన్‌చార్జుల ఐదో లిస్టుని విడుదల చేశారు. నాలుగు ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌ఛార్జుల్ని నియమించినట్టు తెలిపారు.
ఎంపీ స్థానాలకు ఇన్‌ఛార్జులు
* కాకినాడ - చలమల శెట్టి సునీల్
* మచిలీపట్నం - సింహాద్రి రమేష్ బాబు
* నరసరాపుపేట - పీ. అనిల్‌కుమార్ యాదవ్
* తిరుపతి - మద్దిల గురుమూర్తి
ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌ఛార్జులు
* సత్యవేడు - నూకతోటి రాజేష్
* అవనిగడ్డ - సింహాద్రి చంద్రశేఖరరావు
* అరకు - రేగం మత్య్సలింగం
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. మేం కూడా సిధ్దమని ఎక్కడైతే ఫ్లెక్సీ కట్టారో, అక్కడ ఆ పార్టీ పోటీ చేస్తుందా? అని ప్రశ్నించారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. మేము సిద్ధమని వైసీపీ అనడానికి ఓ అర్థం ఉందని అన్నారు. జనసేన ఎన్న స్థానాలకు సిద్ధమవుతోంది? తెలుగుదేశం ఎన్ని స్థానాలకు పోటీ చేస్తోందని ప్రశ్నించారు. వాళ్లు మందలుగా వస్తున్నారని.. జగన్ మొత్తం స్థానాలకు శంఖారావం పూరించారని అన్నారు. తాము ప్రతిచోటా పోటీ చేస్తామని.. ప్రతి బూత్‌లలోనూ సిద్ధమని తాము చెప్తున్నామని పేర్కొన్నారు. అలాగే.. పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు, చేర్పులు అవసరం అవుతాయని వివరణ ఇచ్చారు. అవకాశం రాని అభ్యర్థులకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.