SIT: సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్ల గల్లంతు?
ABN , Publish Date - Jun 07 , 2024 | 07:37 AM
సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతు అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే ఎందుకైనా మంచిదని అధికారులు సర్దేసినట్టు సమాచారం. స్కిల్ కేసుతో సంబంధమున్న మరి కొన్ని కేసుల్లో ఫైళ్లు మాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు ఎక్కడున్నాయని హైకోర్ట్ ప్రశ్నించింది.
అమరావతి: సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతు అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే ఎందుకైనా మంచిదని అధికారులు సర్దేసినట్టు సమాచారం. స్కిల్ కేసుతో సంబంధమున్న మరి కొన్ని కేసుల్లో ఫైళ్లు మాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు ఎక్కడున్నాయని హైకోర్ట్ ప్రశ్నించింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని ప్రజలు సైతం విశ్వసించారు. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని నమ్మిన కొంతమంది పోలీస్ అధికారుల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఆందోళన పెరిగినట్టుగా తెలుస్తోంది. వెంటనే ముందుగా సిట్ కార్యాలయంపై కొంతమంది అధికారులు దృష్టి పెట్టారు.
రాజధాని, ఇసుక, మద్యం, స్కిల్ కేసుల ఫైళ్లలోని కొన్ని పేపర్లు మాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని పత్రాలు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సమాచారాన్ని టీడీపీ అగ్రనేతలకు కొంతమంది పోలీస్ అధికారులు చేరవేశారు. దీంతో వెంటనే సిట్ కార్యాలయానికి తాళం వేసి ఉన్నతాధికారులు పోలీస్ కాపలా పెట్టారు. సిట్‌తో పాటు ఇతర బాధ్యతల నుంచి వెంటనే కొల్లి రఘురామిరెడ్డిని ఉన్నతాధికారులు తప్పించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే స్కిల్ కేస్‌లో హెరిటేజ్ పత్రాలను సిట్ అధికారులు తగులబెట్టారు. అప్పట్లోనే గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ కార్యాలయంలో నిన్న ఫైల్స్ గల్లంతు అని ప్రచారం జరిగింది. పోలీసులు వెళ్లి తనిఖీ చేసి గల్లంతు కాలేదని నిర్ధారించుకున్నారు. ఇప్పటికే పలు కీలక కార్యాలయాల్లో ఈ ఆఫీస్ లాగిన్ ఐడీలను పోలీసులు డిజేబుల్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ!
Read Latest AP News and Telugu News