Share News

MLA: త్వరలో ముగ్గురు వైపీసీ నేతలు జైలుకు వెళ్తారు..

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:16 PM

వైసీపీ అక్రమార్కులను త్వరలోనే జైలుకు పంపుతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(MLA Bojjala Sudheer Reddy) అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కారం కోసం మండలాల వారీగా సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్ల జాబితాను విడుదల చేసిన ఆయన.. మీడియాతో మాట్లాడారు.

MLA: త్వరలో ముగ్గురు వైపీసీ నేతలు జైలుకు వెళ్తారు..

- సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా ప్రత్యేక సిబ్బంది

- ఎమ్మెల్యే సుధీర్‌ వెల్లడి

శ్రీకాళహస్తి(తిరుపతి): వైసీపీ అక్రమార్కులను త్వరలోనే జైలుకు పంపుతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(MLA Bojjala Sudheer Reddy) అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కారం కోసం మండలాల వారీగా సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్ల జాబితాను విడుదల చేసిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తిలో కొందరు వైసీపీ నాయకులు ఐదేళ్లపాటు సాగించిన దుర్మార్గాలను వెలికి తీస్తున్నట్లు చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: Tirumala: అన్నా.. నేను చనిపోతున్నా.. తిరుమల నుంచి సెల్ఫీ వీడియో పంపిన యువతి


మరో మూడు రోజుల్లోనే ముగ్గురు వైసీపీ నాయకులు జైలుకు వెళ్లబోతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం మండలాల వారీగా ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి(Srikalahasti) పట్టణానికి మనోజ్‌కుమార్‌ను 94917 06316 నెంబరులో సంప్రదించాలని సూచించారు.


nani6.jpg

అలాగే శ్రీకాళహస్తి మండలానికి మణెమ్మ (70321 78191), తొట్టంబేడుకు భారతి (91820 31426), ఏర్పేడుకు హేమ (94418 55838), రేణిగుంటకు సుజాత (83670 90320)ను నియమించామన్నారు. ఈ మేరకు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. పలువురు బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చెంచయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2024 | 12:17 PM