Share News

Srikakulam : ఆటోను ఢీకొన్న ఎమ్మెల్యే తనయుడి వాహనం

ABN , Publish Date - Dec 22 , 2024 | 05:12 AM

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

 Srikakulam : ఆటోను ఢీకొన్న ఎమ్మెల్యే తనయుడి వాహనం

  • ఐదుగురికి తీవ్ర గాయాలు

పాతపట్నం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పాతపట్నం ఎమ్మెల్యే మామి డి గోవిందరావు తనయుడు సాయిగణేష్‌ ప్రయాణిస్తున్న స్కార్పియో.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ఆటోడ్రైవర్‌ కూర్మాన సునీల్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్‌ సిబ్బంది క్షతగాత్రులను పాతపట్నంలోని 50 పడకల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులది పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం లివిరి గ్రామం. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా పాతపట్నంలో సమీప బంధువు మృతి చెందగా.. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. స్కార్పియో డ్రైవర్‌ పల్లి రాజే్‌షను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వి.రామారావు తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 05:12 AM