Share News

Kesineni Nani: సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ కేశినేని నాని

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:59 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నాని కలిశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లితో పాటు కేశినేని నాని క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

Kesineni Nani: సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ కేశినేని నాని

అమరావతి, జనవరి 10: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి‌తో (AP CM YS Jagan Reddy) విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Kesineni Nani) భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను ఆయన కలిశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లితో పాటు కేశినేని నాని క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

కాగా.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామ చేశారు. టీడీపీతో తన ప్రయాణం ముగిసిందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను కేశినేని నాని కలవడం ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 10 , 2024 | 04:06 PM