Share News

Mudragada Kranthi: పేరే మారింది.. ఆలోచనలు కాదు.. తండ్రిపై కూతురు విసుర్లు

ABN , Publish Date - Jun 22 , 2024 | 08:08 AM

ఎన్నికల సమయంలో కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీరును సొంత కూతురు ముద్రగడ క్రాంతి తప్పు పట్టారు. పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడంతో క్రాంతి ఘాటుగా స్పందించారు. ఆ సమయంలో తండ్రికూతుళ్ల మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఇప్పుడు మళ్లీ మాటల యుద్ధం మొదలైంది.

Mudragada Kranthi: పేరే మారింది.. ఆలోచనలు కాదు.. తండ్రిపై కూతురు విసుర్లు
Mudragada Kranthi

అమరావతి: ఏపీ ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం కొలువుదీరింది. సభలో సభ్యులు ప్రమాణం కూడా చేశారు. విమర్శల మాత్రం తగ్గడం లేదు. ఎన్నికల సమయంలో కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీరును సొంత కూతురు ముద్రగడ క్రాంతి (Mudragada Kranthi) తప్పు పట్టారు. పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడంతో క్రాంతి ఘాటుగా స్పందించారు. ఆ సమయంలో తండ్రికూతుళ్ల మధ్య డైలాగ్ వార్ జరిగింది. పిఠాపురం అసెంబ్లీలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఆ మేరకు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా ముద్రగడ పద్మనాభం కామెంట్లు చేయడంతో క్రాంతి స్పందిచారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎక్స్‌లో ట్వీట్ చేశారు.


అర్హత లేదు..

‘వైసీపీ అధినేత జగన్ గురించి ఏమి మాట్లాడరు. ఏ విషయంలో కూడా జగన్‌ను ప్రశ్నించరు. పవన్ కల్యాణ్‌‌పై మాత్రం విమర్శలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏం చేయాలో పవన్ కల్యాణ్‌కు అవగాహన ఉంది. స్పష్టమైన విధానం ఉంది. జగన్‌కు అలాంటిదేమి లేదు. అందుకే ప్రజలు కూటమికి బ్రహ్మారథం కట్టారు. ప్రజలకు మంచి చేయాలన ఆలోచన జగన్‌కే కాదు ముద్రగడ పద్మనాభానికి కూడా లేదు. ఎన్నికల సమయంలో చేసిన సవాల్ మేరకు పేరు మార్చుకున్నారు. ఆలోచన విధానం ఏమాత్రం మారలేదు అని’ ముద్రగడ క్రాంతి ట్వీట్ చేశారు.


విశ్రాంతి తీసుకొండి

కూటమి చెప్పిన అంశాలు నమ్మి జనం అధికారం కట్టబెట్టారు. భారీ మెజార్టీతో గెలుపించారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని తండ్రి పద్మనాభానికి క్రాంతి సూచించారు. శేష జీవితాన్ని ఇంటికి పరిమితం చేయాలని కోరారు. విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందన్నారు. తన కూతురు క్రాంతి చేత జనసేన, టీడీపీ నేతలు మాట్లాడిస్తున్నారని గతంలో ముద్రగడ పద్మనాభం ఆరోపించిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 22 , 2024 | 08:08 AM