Home » Mudragada Kranthi
ఎన్నికల సమయంలో కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీరును సొంత కూతురు ముద్రగడ క్రాంతి తప్పు పట్టారు. పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడంతో క్రాంతి ఘాటుగా స్పందించారు. ఆ సమయంలో తండ్రికూతుళ్ల మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఇప్పుడు మళ్లీ మాటల యుద్ధం మొదలైంది.
ఎన్నికల సమయంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో సవాలు చేస్తుంటారు. పేరు మార్చుకుంటానని కొందరు, ముక్కు నేలకు రాస్తానని మరికొందరు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరికొందరు.. క్షమాపణలు చెప్తానంటూ ఇలా ఎన్నో రకాల సవాలు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు.
వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరో సంచలనానికి దారితీశారు. ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది..? ప్రచారానికి పోతే ఏంటి.. పోకపోతే ఏంటనుకున్నారో ఏమో కానీ మీడియా ముందు వాలిపోయారు. ఇక గొట్టాల ముందుకు వస్తే ముద్రగడ ఎలా మాట్లాడుతారో తెలుసు కదా. యథావిధిగా తన నోటికి పనిచెప్పారు. బాబోయ్.. ఆయన మాట్లాడుతుంటే అది నోరా.. తాటిమట్టా అన్నట్లుగా సొంత పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి..
ఏపీలో ఎన్నికల వేళ అందరిదృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీచేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకూడదనే ఏకైక లక్ష్యంతో వైసీపీ ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కాపు ఉద్యమనాయకుడిగా పేరొందిన ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకుని.. పిఠాపురంలో పవన్‌ను ఓడించే బాధ్యతలు అప్పగించారు.
ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు మొత్తం రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిషితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది చేసే నష్టాన్ని ఊహించలేం.. ఇలాంటి అనుభవాలు ఎన్నో స్వాతంత్య్ర భారతంలో చూశాం. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిన్నటి వరకు మనవాళ్లుగా ఉన్నవాళ్లే.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. నువ్వు సూపర్ అంటూ ప్రశంసినవాళ్లే.. వాడో వేస్ట్ అంటూ విమర్శించవచ్చు.. ఎన్నికల వేళ ఇవ్వన్నీ సాధారణ విషయాలు అయిపోయాయి.
వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కుమార్తె క్రాంతి భారతి మరో సంచలనానికి తెరదీశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని చెప్పడం.. ఆ తర్వాత పేరు కూడా మార్చుకుంటానని ముద్రగడ చేసిన ప్రకటనపై క్రాంతి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్‌కు స్పందించిన ‘కూతురు నా ప్రాపర్టీ కాదు’ అని చెప్పడం పెద్ద సంచలనమే అయ్యింది. తాజాగా..