Share News

Andhra Pradesh: ఏపీ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆ హైవే ఆరు లైన్లుగా విస్తరణ

ABN , Publish Date - Dec 16 , 2024 | 11:59 AM

ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు గుడ్ న్యూస్. ఆ హైవే విస్తరణ పనులు త్వరలో మొదలవనున్నాయి. ఆరు లైన్లుగా ఆ హైవేను విస్తరించనున్నారు. దీంతో హైవే కాస్తా హైస్పీడ్‌వేగా మారనుంది.

Andhra Pradesh: ఏపీ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆ హైవే ఆరు లైన్లుగా విస్తరణ
National Highways

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు విస్తరణపై ఫుల్ ఫోకస్ జరుగుతోంది. కొత్తగా పలు నేషనల్ హైవేలను అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మరికొన్నింటిని విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. జాతీయ రహదారుల విస్తరణపై ఇప్పటికే కసరత్తు మొదలైపోయింది. చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న హైవేల విస్తరణ మీద కూడా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఓ ప్రధాన రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలని భావిస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష కూడా చేశారు. మరి.. ఆ హైవే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..


త్వరలో షురూ..

శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం దాకా నేషనల్ హైవేను ఆరు లైన్లుగా విస్తరించనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీని మీద కేంద్ర సర్కారు సానుకూలంగా ఉందన్నారు. ఈ హైవే సమస్యను పరిష్కరించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరామని చెప్పారు. త్వరలో విస్తరణ పనులు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.


రవాణా మరింత వేగవంతం

నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో మొదయల్యే అవకాశం ఉందన్నారు రామ్మోహన్ నాయుడు. ఈ మేరకు హైవే ప్రాజెక్టుల మీద అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ హైవే విస్తరణ ద్వారా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సరుకు రవాణా మరింత వేగవంతం అవుతుందన్నారు. కొత్తగా నిర్మించబోయే భోగాపురం-మూలపేట పోర్టు గురించి కూడా ఆయన అధికారులతో చర్చించారు. ఈ పోర్టును అనుసంధానం చేసేలా వైజాగ్-మూలపేట బీచ్ కారిడార్ రోడ్డు ప్రతిపాదనలపై పనుల పురోగతి ఆయన అడిగి తెలుసుకున్నారు.


Also Read:

మాఫియాలు నడిపే జగన్‌కు డాక్యుమెంట్ల విలువ ఏం తెలుసు

భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ భార్యపై అమానుషం

KC రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..

For More AP And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 12:05 PM