Share News

Fire Accident: నెల్లూరులో దారుణం.. మంటల్లో చిక్కుకుని బాలిక మృతి..

ABN , Publish Date - Jun 20 , 2024 | 05:20 PM

నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. బర్మాసెల్ గుంట (Barmasel Gunta) వద్ద పూరిళ్లల్లో ఒక్కసారిగా మంటలు(Fire Accident) చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిక్కుకొని నాగలక్ష్మి (Nagalakshmi) అనే బాలిక మృతిచెందినట్లు తెలుస్తోంది.

Fire Accident: నెల్లూరులో దారుణం.. మంటల్లో చిక్కుకుని బాలిక మృతి..

నెల్లూరు: నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. బర్మాసెల్ గుంట (Barmasel Gunta) వద్ద పూరిళ్లల్లో ఒక్కసారిగా మంటలు(Fire Accident) చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని నాగలక్ష్మి (Nagalakshmi) అనే బాలిక మృతిచెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రెండు పూరిళ్లు దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. చిన్నారి మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలిక బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. నాగలక్ష్మి మృతితో కుటుంబసభ్యులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇది కూడా చదవండి:

MLA Srinivasa Rao: పీఎం పాలెం టిడ్కో ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

Updated Date - Jun 20 , 2024 | 07:13 PM