AP News: శరవేగంగా విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ.. వణికిపోతున్న గ్రామాలు
ABN , Publish Date - Feb 16 , 2024 | 10:36 AM
Andhrapradesh: బర్డ్ ఫ్లూతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో బాయిలర్, లేయర్, నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో బర్డ్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తోంది.
నెల్లూరు, ఫిబ్రవరి 16: జిల్లాలో బర్డ్ ఫ్లూతో (Bird Flu) ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో బాయిలర్, లేయర్, నాటుకోళ్లు మృత్యువాతపడుతున్నాయి. జిల్లాలో బర్డ్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తోంది. నాలుగు రోజులు కిందట ఈ విషయాన్ని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN-Andhrajyothy) వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. భూపాల్‌లోని ల్యాబ్‌లకు శ్యాంపుళ్లను పంపారు. బర్డ్ ఫ్లూగా భూపాల్ ల్యాబ్ నిపుణులు నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు బర్డ ఫ్లూతో వణికిపోతున్నారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పొదలకూరు, కోవూరు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టారు. బయట వ్యక్తులు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చికెన్ దుకాణాలను అధికారులు మూసివేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...