Share News

CM Chandrababu: పీఎస్‌ఎల్‌వి-సి 60 విజయవంతంపై సీఎం చంద్రబాబు హర్షం.,.

ABN , Publish Date - Dec 31 , 2024 | 07:20 AM

CM Chandrababu: శ్రీహరి కోట, ఇస్రో నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వి-సి 60 రాకెట్ విజయవంతంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది మానవ సహిత అంతరిక్ష యానానికి, ఉపగ్రహాల మెయింటినెన్స్‌కు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు.

CM Chandrababu: పీఎస్‌ఎల్‌వి-సి 60 విజయవంతంపై సీఎం చంద్రబాబు హర్షం.,.
CM Chandrababu Naidu

అమరావతి: శ్రీహరి కోట, ఇస్రో (ISRO) నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వి-సి 60 (PSLV-C 60)మిషన్ మరో మైలురాయిని చేరుకోవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాద్యమం ఎక్స్ (Social Media X) వేదికగా పేర్కొన్నారు. కక్ష్యలో స్పేస్ డాకింగ్ ప్రయోగం విజయవంతం అవడం ఆర్బిటాల్ డాకింగ్‌లో భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తోందన్నారు. ఇది మానవ సహిత అంతరిక్ష యానానికి, ఉపగ్రహాల మెయింటినెన్స్‌కు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఈ మిషన్ సక్సెస్ కావడంతో చంద్రయాన్ 4, చంద్రుని నమూనాలతో తిరిగి రావడం, భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి లక్ష్యాలకు మరింత చేరువ చేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

స్పేస్‌ డాకింగ్‌ మిషన్‌లో తొలి ఘట్టం విజయవంతం


కాగా అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. ఆపై వాటిని అనుసంధానం చేసే దిశగా చేపట్టిన ప్రయోగంలో తొలి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ఈ మిషన్‌లో భాగంగా ఎస్‌డీఎక్స్‌01 (ఛేజర్‌), ఎస్‌డీఎక్స్‌02 (టార్గెట్‌) ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ-సీ60.. వాటిని 476 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార భూ కక్ష్యలో విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ కక్ష్యలో విడివిడిగా తిరుగుతున్న ఈ ఉపగ్రహాలను కొద్దిరోజుల తర్వాత సంక్లిష్ట విన్యాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు అనుసంధానం (డాకింగ్‌) చేయనున్నారు. అది విజయవంతమైతే.. ఇప్పటికే డాకింగ్‌ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్‌ సగర్వంగా నిలుస్తుంది!


జనవరిలో మరిన్ని..

వచ్చే ఏడాది జనవరిలో షార్‌ నుంచి మరిన్ని ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. పీఎస్ఎల్వీ రాకెట్‌ నావిగేషన్‌ రెండో సిరీస్‌లో ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని పంపనున్నామని వెల్లడించారు. జనవరి మూడో వారంలో జీఎస్ఎల్వీ-ఎఫ్‌15 ప్రయోగం ఉంటుందన్నారు. ఇది కాకుండా.. గగన్‌యాన్‌-జీ1 ద్వారా మావనరహిత ప్రయోగం ఉంటుందని చెప్పారు. 2025లో షార్‌ నుంచి మరిన్ని ప్రయోగాలు చేపడతామని తెలిపారు. పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సోమవారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. పూజలు చేశారు. అంతకుముందు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్రో అధికారులు పీఎ్‌సఎల్వీ-సీ60 నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘కెజియఫ్’ స్టార్ సంచలన లేఖ

వైఎస్ జగన్‌కు ఊహించని షాక్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 31 , 2024 | 07:20 AM