Kotam Reddy: సీఎం జగనే ఇసుక వ్యాపారం చేశారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
ABN , Publish Date - Oct 30 , 2024 | 12:18 PM
వైసీపీ హయాంలో ఇసుక ట్రాక్టర్లకు లోడ్ చేసేవాళ్ళు కాదని, టిప్పర్లు లోడ్ చేసేవాళ్ళని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఎందుకంటే ట్రాక్టర్లు పేదోళ్ళవి.. టిప్పర్లు ముఖ్యమంత్రివి.. ఇసుక టిప్పర్లు టచ్ చేస్తే సీఎం కార్యాలయం నుంచి కాల్ చేసే వాళ్లని.. ఎస్పీలు, కలెక్టర్లు ఏజంట్లుగా పని చేశారని ఆరోపించారు. అందుకే 11 సీట్లు ఇచ్చి జనం ఛీ కొట్టారన్నారు.
నెల్లూరు: రూరల్ టీడీపీ కార్యాలయంలో (TDP Office) బుధవారం జరిగిన ‘ఉచిత ఇసుకపై జన ఆనందం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) పాల్గొన్నాన్నారు. ఉచిత ఇసుక (Free Sand) విధానంపై భవన నిర్మాణ కార్మికులు, బిల్డర్లు, నిర్మాణదారులు, ట్రాక్టర్ల యజమానులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ట్రక్కు ఇసుక ధర రూ.5 వేలు నుంచి రూ.6 వేలు ఉండేదని.. అయినా ఇసుక దొరికేది కాదన్నారు. ఇప్పుడు అదే ఇసుక రూ.1000 వస్తోందన్నారు. వైసీపీ హయాంలో సీఎం జగనే ఇసుక వ్యాపారం చేశారని, ఎమ్మెల్యేలకు ప్రశ్నించే అవకాశం ఉండేది కాదని, ఏజెంట్లుని పెట్టుకుని ఇసుక వ్యాపారం నడిపించారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో ఇసుక ట్రాక్టర్లకు లోడ్ చేసేవాళ్ళు కాదని, టిప్పర్లు లోడ్ చేసేవాళ్ళని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఎందుకంటే ట్రాక్టర్లు పేదోళ్ళవి.. టిప్పర్లు ముఖ్యమంత్రివి.. ఇసుక టిప్పర్లు టచ్ చేస్తే సీఎం కార్యాలయం నుంచి కాల్ చేసే వాళ్లని.. ఎస్పీలు, కలెక్టర్లు ఏజంట్లుగా పని చేశారని అన్నారు. 11 సీట్లు ఇచ్చి జనం ఛీ కొట్టి తిరస్కరించారని.. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతలు సహకరించాలని సూచించారు. ఇసుక విషయంలో వైసీపీ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో ఇసుక విషయంపై ఎమ్మెల్యే, ఎంపీలకు మాట్లాడే హక్కు కూడా ఉండేది కాదన్నారు. జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే, చంద్రబాబు గాడిలో పెడుతున్నారన్నారు. ఇసుక కోళ్లగొట్టి జగన్ ప్రజల నెత్తిన భారం పెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేరుస్తున్నారని.. ‘ఇసుక అధిక ధరల అంతం.. చంద్రబాబు పంతం’ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా ఇసుక నేతల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు. తెలంగాణకు పరుగులు తీస్తున్న ఇసుక వాహనాలకు కళ్లెం వేయాలని నిర్ణయించారు. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు టెక్నాలజీతో నిఘాను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పది చెక్‌పోస్టులు ఉన్నాయి. వాటిని మరింతగా పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో శివారున తెలంగాణ సరిహద్దును ఆనుకుని ఉన్న గ్రామాల్లో మొత్తం 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయబోతున్నాయి. తెలంగాణలోకి ప్రవేశించడానికి మార్గాలు ఉన్న అన్ని గ్రామాల్లోను ఈ చెక్‌పోస్టులు పెడుతున్నారు.
పోలీస్ అధికారులకు సీపీ హెచ్చరిక
ఇసుక అక్రమ రవాణా పెరగడం, ధరలు విపరీతంగా ఉండడంతో పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో ఉన్న పోలీసు అధికారులతో కొద్దిరోజుల క్రితం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లా నుంచి ఇసుక ఒక్క రేణువు తెలంగాణలో పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అసలు ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ఏం చేయాలన్న దానిపై డీసీపీలతో సమావేశమై ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఉంది. దీన్ని పరిస్థితులను బట్టి వివిధ శాఖలు ఉపయోగించుకుంటాయి. దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించడంతోపాటు సరిహద్దు గ్రామాల్లో కొత్తగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’
కేసులతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు..
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్
తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ..
శ్రీవారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News