Home » Free Sand Scheme
వైసీపీ హయాంలో ఇసుక ట్రాక్టర్లకు లోడ్ చేసేవాళ్ళు కాదని, టిప్పర్లు లోడ్ చేసేవాళ్ళని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఎందుకంటే ట్రాక్టర్లు పేదోళ్ళవి.. టిప్పర్లు ముఖ్యమంత్రివి.. ఇసుక టిప్పర్లు టచ్ చేస్తే సీఎం కార్యాలయం నుంచి కాల్ చేసే వాళ్లని.. ఎస్పీలు, కలెక్టర్లు ఏజంట్లుగా పని చేశారని ఆరోపించారు. అందుకే 11 సీట్లు ఇచ్చి జనం ఛీ కొట్టారన్నారు.
ఉచిత ఇసుక పాలసీ 2024లో సినరేజీ ఫీజు మాఫీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు.ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21 న జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా ఇసుక పొందడంలో ఇబ్బందులు పడటంతో పాటు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రమండలి సమావేశంలో చంద్రబాబు ఇసుక విషయంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉచిత ఇసుక పోర్టల్‌ను అవిష్కరించనున్నారు. దీంతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది.
‘ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమలులో గందరగోళం ఎందుకు వచ్చింది?
ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ఇదే సమావేశంలో పలు యాక్ట్‌లకు ఆమోదం కూడా లభించింది. ముఖ్యంగా.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఉచిత ఇసుక విధానం, రబీ సీజన్లో ధాన్యం సేకరణపై కీలకంగా చర్చ సాగింది...
సామాన్యుడి కల నెరవేరుతోంది. ఇంటి నిర్మాణం కోసం గత ఐదేళ్లు పడ్డ కష్టానికి ఈ ప్రభుత్వంలో ఉపశమనం లభిస్తోంది. అతి తక్కువ ధరలో ఇసుక అందుబాటులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 8 స్టాక్ యార్డుల్లో ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించింది. పది చక్రాల లారీలో 20 మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకు వెళ్లే వినియోగదారునికి రూ.12వేలకే ఇసుకు ఇంటికి చేరుతోంది. గత ప్రభుత్వంలో ఇదే లారీ ఇసుక ఇంటికి చేరేసరికి రూ.24వేలు అయ్యేది. ఉచిత ఇసుక మొదలైన తొలి రెండ్రోజుల్లోనే యార్డుల వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టాయి.
ఉచిత ఇసుక విధానంపై తెలుగు యు వత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడుపూటి నారాయణస్వామి హర్షం వ్యక్తం చేశారు. దానిని అమలు చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక శారదా,గర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ అపార్టు మెం ట్లో మంగళవారం భవన నిర్మాణ కార్మికులతో కలిసి చంద్రబాబు చిత్రపటా నికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం హర్షణీయమన్నారు.
Andhrapradesh: ఏపీలో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది. ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానం రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించిన ప్రభుత్వం...