Ramskrishna: వెంకటగిరి టిక్కెట్టు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం
ABN , Publish Date - Apr 21 , 2024 | 09:49 AM
నెల్లూరు జిల్లా: వెంకటగిరి అభ్యర్థి విషయంలో తెలుగుదేశం అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయిప్రియని గతంలో టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే...
నెల్లూరు జిల్లా: వెంకటగిరి అభ్యర్థి విషయంలో తెలుగుదేశం (TDP) అధిష్టానం కీలక నిర్ణయం (Key Decision) తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయిప్రియ (Lakshmi Sai Priya)ని గతంలో టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు రాంకుమార్ రెడ్డి (Ram Kumar Reddy)ని ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కోవడానికి టీడీపీ కొత్త వ్యూహం రూపొందించింది. వెంకటగిరి టిక్కెట్టు కురుగుండ్ల రామకృష్ణ (Ramakrishna)కు ఇవ్వాలని అధిష్టానం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కురుగుండ్లకి ఫోన్ చేసింది. దీంతో బీఫామ్ తెచ్చుకునేందుకు రామకృష్ణ విజయవాడకు బయలుదేరారు.
కాగా సార్వత్రిక ఎన్నికల (Elections) నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) తన నివాసంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ (Assembly), పార్లమెంట్ (Parliament) అభ్యర్థులకు బిఫామ్స్ (B forms) ఇవ్వనున్నారు. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు తన చేతుల మీదుగా బిఫామ్స్ ఇవ్వనున్నారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు సమావేశం అవుతారు. ప్రచారం, వ్యూహ ప్రతి వ్యూహాలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. మే 13న పోలింగ్ జరగ్గా.. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ గులకరాయి కేసు: వేముల దుర్గారావు అరెస్టు.. విడుదల..
ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?
పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!