Share News

TDP: నెల్లూరులో తెలుగు యువత ఆందోళన..

ABN , Publish Date - Feb 25 , 2024 | 08:12 AM

నెల్లూరు: భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత ఆందోళనకు దిగింది. ఈ సందర్బంగా టీడీపీ శ్రేణులు నగరంలో భారీ బైకు ర్యాలీలు నిర్వహించారు.

TDP: నెల్లూరులో తెలుగు యువత ఆందోళన..

నెల్లూరు: భగత్ సింగ్ కాలనీ (Bhagath Singh Colony)లోని టిడ్కో ఇళ్ల (Tidco houses) సముదాయం వద్ద వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి (Vemireddy Vijayabhaskar Reddy) ఆధ్వర్యంలో తెలుగు యువత ఆందోళనకు దిగింది. ఈ సందర్బంగా టీడీపీ (TDP) శ్రేణులు నగరంలో భారీ బైకు ర్యాలీలు నిర్వహించారు. మాజీ మంత్రి నారాయణ (Narayana) నెల్లూరు నగరాన్ని 90 శాతం అభివృద్ది చేస్తే... వైసీపీ అధికారంలోకి వచ్చాక 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారని ఎమ్మెల్యే అనిల్ కుమార్‌పై ధ్వజమెత్తారు. పూర్తి అయిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసుకున్నారని ఆరోపించారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఎందుకు కేటాయించరంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 25 , 2024 | 08:14 AM