Share News

Srinivas Varma: ఆర్గానిక్ చేపల పెంపకం అన్ని రకాలుగా మంచిది

ABN , Publish Date - Oct 05 , 2024 | 03:03 PM

Andhrapradesh: ఆర్గానిక్ చేపల పెంపకం అన్ని రకాలుగా మంచిదని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. చేప తినడం వలన అనేక అనారోగ్యలకు మంచిదని.. చేప నూనె అనేక మందులలో వినియోగిస్తారన్నారు. మత్స్యకారులకు ప్రోత్సాహకంగా పీఎం మత్స్య సంపద యోజన ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు.

Srinivas Varma: ఆర్గానిక్ చేపల పెంపకం అన్ని రకాలుగా మంచిది
AP Fish Food Festival

నెల్లూరు, అక్టోబర్ 5: నగరంలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతి శ్రీనివాస వర్మ (Union Minister Bhupathiraju Srinivasa Varma) ప్రారంభించారు. వీఆర్సీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కేంద్రమంత్రి పరిశీలించి ఆపై నిర్వాహకులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్గానిక్ చేపల పెంపకం అన్ని రకాలుగా మంచిదని తెలిపారు. చేప తినడం వలన అనేక అనారోగ్యలకు మంచిదని.. చేప నూనె అనేక మందులలో వినియోగిస్తారన్నారు.

Canada: కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!



మత్స్యకారులకు ప్రోత్సాహకంగా పీఎం మత్స్య సంపద యోజన ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు. సోమిరెడ్డి అభ్యర్ధనను మత్స్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పరిశ్రమల కోసం ఢిల్లీలో కృషి చేస్తున్నారన్నారు. గత పాలకుల నిర్వాకంతో తరలిపోయిన పరిశ్రమలను వెనక్కు తీసుకొచ్చే కృషి చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు అనుమతులు, భూమి కేటాయింపుల అవసరాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

రూ.100 కోట్లకు మరో దావా వేస్తా


వాటి పెంపకానికి పెట్టింది పేరు నెల్లూరు: సోమిరెడ్డి

నెల్లూరు జిల్లాలో రొయ్యలు, చేపలు పెంపకానికి పెట్టింది పేరని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తమిళనాడు కడలూరు బోట్స్ నిబంధనలను అధిగమిస్తూ వస్తున్నాయని.. కడలూరు బోట్స్ వలన ఆంధ్రప్రదేశ్‌లో మత్సకారులు నష్టపోతున్నారన్నారు. పెద్ద బొట్లల్లో వస్తూ చిన్న చేపలను పట్టుకుపోతూ స్థానిక మత్సకారుల నోళ్లు కొడుతున్నారని మండిపడ్డారు. కడలూరు బోట్స్ తీర ప్రాంతంలో విధ్వంసం చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని కోరుతున్నామని చెప్పారు. కృష్ణపట్నం పోర్ట్ బేస్ చేసుకొని అనుసంధాన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తరలిపోయిన పరిశ్రమలను వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సోమిరెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Rammohan Naidu: సిట్టు గిట్టు లేదనడం ఎంతవరకు సంస్కారం

Mantena: ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2024 | 03:11 PM