Share News

RK Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్

ABN , Publish Date - Sep 24 , 2024 | 11:33 AM

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్ పంచ్ పడింది. తన యూట్యూబ్ ఛానెల్‌లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటి‌జన్లు గట్టి ఝలక్ ఇచ్చారు. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్‌లో పొల్ చేపట్టారు.

RK Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్

తిరుపతి, సెప్టెంబర్ 24: వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్ పంచ్ పడింది. తన యూట్యూబ్ ఛానెల్‌లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటి‌జన్లు గట్టి ఝలక్ ఇచ్చారు. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్‌లో పొల్ చేపట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌దే తప్పంటూ 74 శాతం మందికిపైగా నెటిజన్లు ఓటు వేశారు. అలాగే ఎవరి పాలనలో తిరుమల బాగుందంటూ ఆమె పోల్ పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే తిరుపతి బాగుందంటూ 77 శాతం మందికి పైగా ఓటు వేశారు.

Also Read: Tirupati Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ అధిపతి ఎవరంటే..


తిరుమలలో కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు బాబుతోపాటు కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Geneva: వేలానికి గోల్కొండ వజ్రాలతో పొదిగిన నెక్లెస్..


ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం స్పందించారు. ఆ క్రమంలో చంద్రబాబుతోపాటు ఆయన ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక వై ఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి సైతం సోమవారం తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని హడావుడి సృష్టించిన విషయం విధితమే.


అలాంటి వేళ.. ఆర్కే రోజా తన యూట్యూబ్ చానెల్ ద్వారా తిరుపతి లడ్డూ వ్యవహారంపై పోల్ నిర్వహించారు. అలాగే చంద్రబాబు పాలనపై సైతం ఆమె ఈ సందర్భంగా పోల్ నిర్వహించారు. ఈ సందర్బంగా తిరుపతి లడ్డూ ప్రసాదంలో గత జగన్ ప్రభుత్వం తప్పు ఉందంటూ ఈ పోల్‌లో నెటిజన్లు ఓటు వేశారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు పూర్తి చేసుకుంది.


దీంతో ఇది మంచి ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని కూటమి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లారు. అలాంటి వేళ.. గత జగన్ ప్రభుత్వ పాలన బాగుందా? చంద్రబాబు పాలనా బాగుందా? అంటూ పోల్ నిర్వహించింది. అందులో సైతం చంద్రబాబు పాలనకే నెటిజన్లు మద్దతు ప్రకటించారు. దీంతో ఆర్కే రోజాకు నెటిజన్లు జబర్దస్త్ ఝలక్ ఇచ్చిరానే ఓ చర్చ సైతం వాడి వేడిగా పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తుంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 24 , 2024 | 01:13 PM