NRI Naveen : రోజంతా సీఎంతో ఉండే చాన్స్..!
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:07 AM
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వీడన్ నుంచి వచ్చి ఐదు నెలలపాటు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రవాసాంధ్రుడు ఉన్నం నవీన్‌కు అరుదైన గౌరవం దక్కింది.
ఎన్‌ఆర్‌ఐ ఉన్నం నవీన్‌కు అరుదైన గౌరవం
‘డే విత్ సీబీఎన్’ కార్యక్రమానికి ఎంపిక
స్వీడన్ నుంచి వచ్చి ఎన్నికల్లో పనిచేసినందుకు గుర్తింపు
అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వీడన్ నుంచి వచ్చి ఐదు నెలలపాటు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రవాసాంధ్రుడు ఉన్నం నవీన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఒక రోజంతా తనతోపాటు ఉండే అవకాశం కల్పించారు. ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన వారిలో అత్యుత్తుమ ప్రతిభ కనబరిచిన వారి కోసం టీడీపీ ‘డే విత్ సీబీఎన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా నవీన్ ఇక్కడ ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చంద్రబాబుతోనే ఉండి ఆయన నిర్వహించే సమావేశాల్లో, వివిధ చర్చల్లో పాల్గొన్నారు. కాగా.. నవీన్ తనకు ఇచ్చిన ఈ అద్భుత అవకాశానికి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.