Alapati Raja: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఒక్క ఎన్టీఆరే..
ABN , Publish Date - May 28 , 2024 | 01:06 PM
ఇవాళ ఎన్టీఆర్ జయంతిని ఆయన కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. టీడీపీ నాయకులంతా జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.
అమరావతి: ఇవాళ ఎన్టీఆర్ జయంతిని ఆయన కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. టీడీపీ నాయకులంతా జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కళారంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించడమే తెలుగు ప్రజలకు చేసుకున్న అదృష్టమన్నారు.
బిల్డర్ మధు హత్య వెనుక ప్రేమ కథ..!
భారతదేశ రాజకీయాల్ని ఒక మలుపు తిప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆలపాటి రాజా కొనియాడారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. రాజకీయాలు ఎన్టీఆర్ ముందు తర్వాత అనేది తెలుసుకోవాల్సిన విషయమని అన్నారు. సామాన్యులకు రాజకీయ రంగ ప్రవేశం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్రాల హక్కుల్ని కాపాడే విషయంలో దేశ ప్రధాని ఇందిరా గాంధీని నిలదీసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడిన తక్కువేనని ఆలపాటి రాజా పేర్కొన్నారు.
Raghurama: ఆ రోజు నా జీవితంలో మధురమైన క్షణాలు: రఘురామ