Home » Alapati Raja
ఎన్నికలలో వైసీపీ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వచ్చిందని, చివరకు పీడీఎఫ్ అభ్యర్దికి వైసీపీ మద్దతు ఇచ్చిందని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోలేదని.. ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. 483 బూత్‌లలో ఒక్క బూత్‌లో కూడా పీడీఎఫ్ అభ్యర్థికి మెజారిటీ రాలేదన్నారు.
కృష్ణా-గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్ధిపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544... చెల్లని ఓట్లు 26, 676.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి.
Andhrapradesh: గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తిప్పికొట్టారు. జగన్ జులం ప్రదర్శించాలని చూస్తూ కుదరదు అంటూ ఆలపాటి రాజా వ్యాఖ్యలు చేశారు. శవ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు.
ఇవాళ ఎన్టీఆర్ జయంతిని ఆయన కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. టీడీపీ నాయకులంతా జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.
Alapati Rajendra Prasad: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమిని కాసింత అసంతృప్తి కూడా వెంటాడుతోంది. టికెట్లు దక్కని సీనియర్లు, మాజీ మంత్రులు, సిట్టింగులు.. కీలక నేతలు టీడీపీ, జనసేన, బీజేపీలను వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారు..