Share News

ఫీజు బకాయిలపై ఆందోళన వాయిదా: బొత్స

ABN , Publish Date - Dec 29 , 2024 | 06:24 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వైసీపీ జనవరి 3న నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని 29కి వాయిదా వేసినట్టు శాసన మండలిలో

ఫీజు బకాయిలపై ఆందోళన వాయిదా: బొత్స

విశాఖపట్నం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వైసీపీ జనవరి 3న నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని 29కి వాయిదా వేసినట్టు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ శనివారమిక్కడ విలేకరులకు తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జనవరి 2న విద్యార్థులకు పరీక్షలు ఉండడంతో ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాయిదా వేశామన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 06:24 AM