Share News

AP News: పయ్యావులకు కీలక బాధ్యతలు..!!

ABN , Publish Date - Jun 14 , 2024 | 04:20 PM

: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు. సీనియారిటి, సామాజిక సమీకరణాల ఆధారంగా శాఖల కేటాయింపు చేశారు. పయ్యావుల కేశవ్‌కు కీలక శాఖలు అప్పగించారు. మంచి వక్త అయిన కేశవ్‌కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పజెప్పారు.

AP News: పయ్యావులకు కీలక బాధ్యతలు..!!
Payyavula Keshav

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు. సీనియారిటి, సామాజిక సమీకరణాల ఆధారంగా శాఖల కేటాయింపు చేశారు. పయ్యావుల కేశవ్‌కు కీలక శాఖలు అప్పగించారు. మంచి వక్త అయిన కేశవ్‌కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో మంత్రివర్గంలో ఆయనకు సీఎం చంద్రబాబు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది.

AP TDP: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు


కీలక శాఖలు

రాష్ట్ర ఆదాయ, వ్యయాలను రూపొందించేది ఆర్థిక శాఖ. ఏటా సభకు బడ్జెట్‌కు ఆర్థికశాఖ మంత్రి సమర్పిస్తారు. కీలకమైన ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్‌కు దక్కింది. ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖలను కూడా పర్యవేక్షిస్తారు. మరో కీలక శాఖ అసెంబ్లీ వ్యవహారాల బాధ్యతలు పయ్యావుల భుజాలపై ఉన్నాయి. సభలో విపక్ష నేతలు గందరగోళం సృష్టించే సమయంలో సభా వ్యవహారాల మంత్రి కీలకంగా మారతారు. బిల్లుల ఓటింగ్, ఆమోదం, ఇతర తీర్మానాల సమయంలో సభా వ్యవహారాల మంత్రికి ప్రాధాన్యం ఉంటుంది.

Andhra Padesh: గుడ్ న్యూస్.. ఏపీలో భారీ పెట్టుబడికి సిద్ధమైన బీపీసీఎల్..!


29 ఏళ్ల ప్రాయంలో

29 ఏళ్ల వయస్సులో... ఎన్టీఆర్ పిలుపుతో పయ్యావుల కేశవ్ రాజకీయాల్లోకి వచ్చారు. విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం కాస్తా ఎక్కువగా ఉంటుంది. 1994 నుంచి 2024 వరకు ఏడుసార్లు ఎన్నికలు జరగగా ఐదుసార్లు పయ్యావుల విజయం సాధించారు. 1999, 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. పయ్యావుల కేశవ్ ఓడిపోయిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో పయ్యావుల విజయం సాధించగా, టీడీపీ ఓడిపోయింది. 2024లో మాత్రం పయ్యావుల గెలుపొందారు.. టీడీపీ కూటమి అధికారం చేపట్టింది. పయ్యావుల కేశవ్‌కు మంత్రిగా అవకాశం వచ్చింది. కీలక శాఖల బాధ్యతలు చూసే అవకాశం కలిగింది.

AP TDP: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

Updated Date - Jun 14 , 2024 | 04:20 PM