Share News

Janasena: జగన్‌ కోసం పాదయాత్ర చేసిన షర్మిలనూ తరిమేశాడు: పీతల మూర్తి

ABN , Publish Date - Mar 07 , 2024 | 10:41 PM

సీఎం జగన్‌ రెడ్డి (CM Jagan) జైల్లో ఉంటే.. ఆయన చెల్లి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాపమని పాదయాత్ర చేస్తే తరిమేశాడని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Peethala Murthy Yadav) అన్నారు. గురువారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ..జగన్ లాగా ఊరుకో ప్యాలస్ లేదన్నారు.

 Janasena: జగన్‌ కోసం పాదయాత్ర చేసిన షర్మిలనూ తరిమేశాడు: పీతల మూర్తి
Peethala Murthy Yadav

విశాఖపట్నం: సీఎం జగన్‌ రెడ్డి (CM Jagan) జైల్లో ఉంటే.. ఆయన చెల్లి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాపమని పాదయాత్ర చేస్తే తరిమేశాడని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Peethala Murthy Yadav) అన్నారు. గురువారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ..జగన్ లాగా ఊరుకో ప్యాలస్ లేదన్నారు. సండూర్ పవర్, భారతి సిమెంట్, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టీవీలు పవన్ కళ్యాణ్‌కి లేవని చెప్పారు. జగన్ లాగా మాట ఇచ్చి మడమ తిప్పడం పవన్‌కి రాదని అన్నారు. కౌలు రైతులను ఆదుకోవాలని పవన్‌ సొంత నిధులు ఇచ్చారని గుర్తుచేశారు.

ఆస్తులు అమ్మి ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. సొంత తల్లినీ కన్నీరు పెట్టీ పార్టీ ప్లీనరీలో అవమానించారని మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం మీటింగ్‌లో అక్క చెల్లెమ్మలు... చేయూత అంటున్నాడని.. తల్లి, చెల్లిని చెంపదెబ్బ కొట్టి కబురులు చెప్తున్నాడని అన్నారు. గంజాయికి యువతను బానిసను చేశారని మండిపడ్డారు. జనాసేన నాయకుల ఇంటికి పోలీసులను పంపి ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. జగన్ గుర్తు పెట్టుకోవాలని.. ఇక 50రోజులే ఉన్నాయని చెప్పారు. ఇంట్లో ఫ్యాన్ వేసి జనాలు నిన్ను కూర్చో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

కొడాలి నానికి జగన్ మొండిచేయి ఇచ్చారు: పంచకర్ల రమేష్

జగన్ చెప్పినట్లు పవన్ కళ్యాణ్‌ను విమర్శించే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి గుడివాడలో టికెట్ ఇవ్వకుండా మొండిచేయి ఇచ్చారని జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు(Panchakarla Ramesh Babu) అన్నారు. జగన్‌కు ఛానల్ లేదని అంటారని.. మొన్నతన ఛానల్‌లో తండ్రి ఫొటో తీసేయించాడని అన్నారు. ఒక కార్యకర్తకు ఇబ్బంది కలిగితే పవన్ కళ్యాణ్ వచ్చారని చెప్పారు. వైసీపీ జెండా మోసిన వారిని అథా పాతాళానికి తొక్కేశారని పంచకర్ల రమేష్ అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 10:41 PM