AP High Court : ప్రభావతి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ABN , Publish Date - Dec 27 , 2024 | 05:54 AM
శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు ఆధారంగా గుంటూరు, నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి

అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు ఆధారంగా గుంటూరు, నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్‌లో సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, ఆయన ప్రస్తుతం అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ వ్యాజ్యంపై విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. తనను కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన సీఐడీ పోలీసులతో పాటు తప్పుడు వైద్య నివేదిక అందజేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇటీవల గుంటూరు, నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.