Share News

Minister Nimmala: జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..

ABN , Publish Date - Oct 29 , 2024 | 12:56 PM

జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, ట‌న్నెల్స్, ఫీడ‌ర్ కెనాల్, రిజర్వాయర్ ప‌నులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.

Minister Nimmala: జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపం..

ప్రకాశం జిల్లా: 2014-19లో గ‌త తెలుగుదేశం (TDP) పాల‌న‌లో వెలుగొండ ప్రాజెక్టుకు (Veligonda Project) రూ. 1373 కోట్లు కేటాయించి,1319 కోట్లు ఖర్చు చేశామని, గ‌త అయిదేళ్ళ జ‌గ‌న్ (Jagan) పాల‌న‌లో రూ. 3,518 కోట్ల బ‌డ్జెట్ కేటాయించి, కేవ‌లం రూ.170 కోట్లు మాత్రమే ఖ‌ర్చు పెట్టారని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్ పాల‌న‌ వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, ట‌న్నెల్స్, ఫీడ‌ర్ కెనాల్, రిజర్వాయర్ ప‌నులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.


నిర్వాసితులను హౌస్ అరెస్ట్ చేసి జగన్ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించారని, రెండో ట‌న్నెల్‌లో త‌వ్విన రెండు ల‌క్షల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టిని మొద‌టి ట‌న్నెల్ చివ‌ర భాగాన పోశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రెండో ట‌న్నెల్ 12వ కిలో మీట‌ర్ ద‌గ్గర మూడేళ్ళ క్రిత‌మే ట‌న్నెల్ బోరింగ్ మెషిన్ పాడై ఉంటే దానిని ఎందుకు బ‌య‌ట‌కు తీయ‌లేక‌పోయారని ప్రశ్నించారు. ఏ ప్రాజెక్టుకు వెళ్ళినా జ‌గ‌న్ విధ్వంసమే క‌నిపిస్తోందన్నారు.

కాగా రెండు ద‌శ‌ల్లో వెలుగొండ ప్రాజెక్టును వెనువెంటనే పూర్తి చేయాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఫేజ్-1లో హెడ్ వ‌ర్క్స్, రెండు ట‌న్నెల్స్, ఫీడ‌ర్ ఛానెల్, రిజ‌ర్వాయ‌ర్, రెగ్యులేట‌ర్ వంటి నిలిచిన‌పోయిన ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే సీజ‌న్ నాటికి 1.19 ల‌క్షల ఎక‌రాల‌కు నీళ్ళు అందించాల‌ని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


జగన్ ఐదేళ్లపాటు ఏం చేశారు..

మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. వెలిగొండ పూర్తయితే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, తాను అధికారంలోకి వస్తే ఏడాదిలోగా వెలుగొండ పూర్తి చేస్తానన్న జగన్ ఐదేళ్లపాటు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, పరిహారం ఇవ్వకుండా ప్రారంభోత్సవం చేసి జిల్లా ప్రజల్ని జగన్ మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014 -19 లోనే మెజార్టీ పనులు పూర్తి చేశామని, జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని విమర్శించారు. ‘వెలిగొండ ప్రారంభించింది సీఎం చంద్రబాబు నాయుడే.. పూర్తి చేసేది చంద్రబాబు నాయుడే’ అని అన్నారు. త్వరితగతిన వెలిగొండ పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, ప్రకాశం జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో దారుణ ఘటన..

ఆస్తుల వివాదంపై అనిల్ ఏమన్నారంటే..

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

హైద్రాబాద్‌లో 163 సెక్షన్ అమలు

బయటపడుతున్న జగన్ అక్రమాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 29 , 2024 | 12:56 PM