Share News

YCP Candidate : టీడీపీ కండువాతో టోల్‌ నాటకం!

ABN , Publish Date - Dec 13 , 2024 | 03:45 AM

అతడి పేరు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌. గుంటూరుకు చెందిన ఇతడు వైసీపీలో చోటా నాయకుడు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రి అంబటి రాంబాబులకు...

YCP Candidate : టీడీపీ కండువాతో టోల్‌ నాటకం!

  • రక్తికట్టించేలా వైసీపీ నేత డ్రామా

  • సోషల్‌ మీడియాలో వైరల్‌

  • కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యం

  • కర్నూలులో కేసుగుంటూరులో అదుపులోకి!

గుంటూరు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): అతడి పేరు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌. గుంటూరుకు చెందిన ఇతడు వైసీపీలో చోటా నాయకుడు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రి అంబటి రాంబాబులకు అనుచరుడిగా ఉంటూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు వీడియోలు చేస్తున్నాడు. ఇటీవల చేసిన రెండు వీడియోలపై కర్నూలులో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఒక వీడియోలో.. ‘ప్రేమ్‌కుమార్‌ మెడలో టీడీపీ కండువా వేసుకుని అనుచరులతో కలిసి ఓ పల్లెటూళ్లో రోడ్డుకు అడ్డుగా బైక్‌పై కూర్చుంటాడు. సెక్యూరిటీ గార్డుతో వాహనాల నుంచి టోల్‌ ఫీజు వసూలు చేస్తుంటాడు. పల్లెటూరులో టోల్‌ఫీజు ఏంటని కారులో వచ్చిన వ్యక్తి ప్రశ్నించగా.. పల్లెటూరైతే రోడ్లు ఉండవా... వాటిపై గుంతలు ఉండవా? అవి పూడ్చడానికి డబ్బులు లేవని డిప్యూటీ సీఎం అన్నారు కదా, డబ్బు కట్టి వెళ్లు అంటూ దబాయిస్తాడు. దీంతో కారులో నుంచి దిగిన వ్యక్తి ‘నమ్మి ఓట్లు వేసినందుకు భలే బుద్ధి చెప్పారు’ అంటూ ప్రభుత్వంపై నిందలు వేసి.. రూ.వంద ఫీజు చెల్లిస్తాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. ప్రేమ్‌కుమార్‌పై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ్‌కుమార్‌ను గురువారం గుంటూరులో కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Dec 13 , 2024 | 03:45 AM