Share News

Rocket Launch : రేపు నింగిలోకిపీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్‌

ABN , Publish Date - Dec 29 , 2024 | 06:16 AM

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ 60 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది.

 Rocket Launch : రేపు నింగిలోకిపీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్‌

  • నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

సూళ్లూరుపేట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ 60 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ వాహక నౌక ద్వారా స్పాడెక్స్‌ జంట ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఈ రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి ఆదివారం రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్‌) శనివారం వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించారు. ఎంఆర్‌ఆర్‌ అనంతరం షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ అధ్యక్షతన శాస్త్రవేత్తలు సమావేశమై ప్రయోగంపై చర్చించిన తరువాత ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగ నేపఽథ్యంలో ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆదివారం షార్‌కు రానున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 06:16 AM