Share News

Rajendranath Reddy: శ్వేతపత్రమా.. సాకు పత్రమా..!

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:57 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపైన వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(Former YCP Minister Buggana Rajendranath Reddy) హైదరాబాద్‌లో స్పందించారు.

Rajendranath Reddy: శ్వేతపత్రమా.. సాకు పత్రమా..!

- సూపర్‌ సిక్స్‌ అమలు చేయలేక మొదటి ఓవర్లోనే డకౌట్‌

- అప్పుపై గవర్నర్‌తోనూ అబద్దం చెప్పించారు

- ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ మంత్రి బుగ్గన

హైదరాబాద్‌ సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపైన వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(Former YCP Minister Buggana Rajendranath Reddy) హైదరాబాద్‌లో స్పందించారు. ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. చంద్రబాబు ప్రవేశపెట్టింది శ్వేత పత్రమా? సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయలేమని చెప్పే సాకు పత్రమా? చెప్పాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. సూపర్‌ సిక్స్‌(Super Six) పథకాలు అమలు చేస్తారని ప్రజలు ఎన్నుకుంటే మొదటి ఓవర్లోనే డకౌట్‌ అయ్యారని విమర్శించారు. వైట్‌ పేపర్‌ ఇచ్చి పథకాలు అమలు చేయలేమని చేతులు దులుపుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.

ఇదికూడా చదవండి: YS Sharmila: సిగ్గు సిగ్గు!! మాజీ సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు!: వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు


వైసీపీ ప్రభుత్వం(YCP Govt) రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ గవర్నర్‌తోనూ అబద్దం చెప్పించారన్న బుగ్గన... అప్పులపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీలో సమావేశం పెట్టకుండా హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు... ‘ఆస్పత్రికి కోసం వచ్చాం. విజయవాడకు వెళ్లి పెట్టేందుకు ఆలస్యమవుతుందనే కారణంగా ఇక్కడ సమావేశం పెట్టాను’ అని బుగ్గన వివరణ ఇచ్చారు.


ఇదికూడా చదవండి: Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 28 , 2024 | 12:57 PM