Share News

Rammohan Naidu : రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి

ABN , Publish Date - Sep 07 , 2024 | 04:00 AM

రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Rammohan Naidu : రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి

మెడికవర్‌ కేన్సర్‌ ఆస్పత్రి ప్రారంభంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

విశాఖపట్నం (ఆరిలోవ), సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. నగర పరిధిలోని ఆరిలోవ హెల్త్‌ సిటీలో 100 పడకలతో నిర్మించిన మెడికవర్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... పదేళ్లలో నాలుగు రాష్ట్రాల్లో 23 ఆస్పత్రులు ఏర్పాటు చేయడంతోపాటు 1,200 మంది వైద్యులు, 13 వేల మంది వైద్య సిబ్బందితో రోగులకు అత్యున్నత వైద్య సేవలందించడం గొప్ప విషయమన్నారు. గతంతో పోలిస్తే విశాఖలో కేన్సర్‌ వ్యాధికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మెడికవర్‌ ఆస్పత్రి ఇండియన్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.అనిల్‌కృష్ణ, డైరెక్టర్లు ఎ.శరత్‌రెడ్డి, పి.హరికృష్ణ, డాక్టర్‌ కృష్ణప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 04:00 AM