YS Sharmila: భారీ విగ్రహాలు పెడితే కడుపు నిండదు.. గణతంత్ర వేడుకల్లో సర్కార్‌పై షర్మిల విసుర్లు
ABN , Publish Date - Jan 26 , 2024 | 10:46 AM
Andhrapradesh: నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డి వేడుకల్లో ఫాల్గొని జాతీయపతాకాన్ని ఎగురవేశారు.
విజయవాడ, జనవరి 26: నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) వేడుకల్లో పాల్గొని జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అంబేడ్కర్ అన్ని వర్గాల వారి కోసం రాజ్యాంగం రూపొందించారన్నారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. అంబేడ్కర్ భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి నిండదన్నారు.
దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఎదిరిస్తే గుండు గీసి అవమానించారని విమర్శించారు. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదని.. ఆయన ఆశయాలను గొప్పగా అమలు చేయాలని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడారని ఆరోపించారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని షర్మిల రెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో రఘువీరా రెడ్డి, తులసి రెడ్డి, జేడీ శీలం, సుంకర పద్మశ్రీ, నరహరశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజి పాల్గొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..