Share News

TDP: రూ.100తో రూ.5 లక్షల బీమా.. టీడీపీ సభ్యత్వ నమోదు ఎప్పటి నుంచంటే

ABN , Publish Date - Oct 25 , 2024 | 03:29 PM

టీడీపీ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అక్టోబర్ 26 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఇదే అంశంపై శుక్రవారం సమీక్షించారు.

TDP: రూ.100తో రూ.5 లక్షల బీమా.. టీడీపీ సభ్యత్వ నమోదు ఎప్పటి నుంచంటే

అమరావతి: టీడీపీ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అక్టోబర్ 26 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఇదే అంశంపై శుక్రవారం సమీక్షించారు. టీడీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీపై ఉండవల్లిలోని తన నివాసంలో నేతలతో చర్చించారు. సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేందుకు తెలుగు దేశం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కేవలం రూ.100 సభ్యత్వంతో టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.


లక్ష రూపాయలు కట్టిన వారికి టీడీపీ నుంచి శాశ్వత సభ్యత్వం కల్పిస్తారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాద బీమా రూ. 2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. చనిపోయిన కార్యకర్త అంత్యక్రియలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో బీమా పొందని 73 మందికి రెండు లక్షల చొప్పున ఇచ్చేందుకు బాబు నిర్ణయించారు. ప్రమాద బీమా కింద ఇప్పటి వరకు రూ.102 కోట్లు, సహజ మరణం, ఇతర సమస్యలకు రూ.18 కోట్లు పార్టీ తరఫున అందించినట్లు చంద్రబాబు చెప్పారు.


లిస్టుపై కసరత్తు..

సభ్యత్వ నమోదుతోపాటు రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై నేతలతో బాబు చర్చించారు. త్వరగా రెండో లిస్ట్ విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. మొదటి దశలో ఇచ్చిన 21 నామినేటెడ్ పదవులకు రెట్టింపు సంఖ్యలో రెండో జాబితా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కూటమి పక్షాలతోనూ చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. కష్టపడిన వారికే పదవి అనే విధానంలో భాగంగా నామినేటెడ్‌ పోస్టులకు ఎంపికపై చర్చిస్తున్నట్లు సమాచారం.

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Updated Date - Oct 25 , 2024 | 03:43 PM