Share News

AP High Court : హైకోర్టులో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:46 AM

ఏపీ హైకోర్టులో సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ కె.చిదంబరం ఆధ్వర్యంలో..

AP High Court : హైకోర్టులో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ కె.చిదంబరం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌.. న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ సుమతి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఏఏజీ సాంబశివ ప్రతాప్‌, పీపీ ఎం లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ పసల పొన్నారావు, అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఎన్‌.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మరోవైపు హైకోర్టు ముందు న్యాయవాదులు ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ ట్రీ వద్ద చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తులు కేక్‌ కట్‌ చేశారు.

Updated Date - Dec 24 , 2024 | 04:46 AM