Share News

Duvvada Srinivas : భగ్గుమన్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:13 AM

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. గురువారం రాత్రి ఆయన ఇంటిముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌనపోరాటానికి దిగారు.

Duvvada Srinivas : భగ్గుమన్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం
Duvvada Srinivas

  • తండ్రి ఇంటి ముందు కుమార్తెల నిరసన

  • మరో మహిళతో ఎలా ఉంటున్నారని ప్రశ్న

  • గేట్లు వేసుకుని ఇంట్లోనే ఉన్న శ్రీనివాస్‌

శ్రీకాకుళం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి)/టెక్కలి/మెళియాపుట్టి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas) కుటుంబ వివాదం రచ్చకెక్కింది. గురువారం రాత్రి ఆయన ఇంటిముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌనపోరాటానికి దిగారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నాయకులపై మితిమీరిన నోటిదురుసుతో విమర్శలు చేసిన దువ్వాడ శ్రీనును మరింతగా ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ పదవిని జగన్‌ కట్టబెట్టారు. ఆతర్వాత టెక్కలి అసెంబ్లీ సీటు ఇచ్చి ప్రచారం కూడా నిర్వహించారు. ఓ దఫా జడ్పీటీసీగా గెలుపొందారు. ఆతర్వాత పలుపార్టీలు మారినా అన్నిచోట్లా ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో టెక్కలి నుంచి అచ్చెన్నాయుడుపై పోటీచేసి భారీ తేడాతో ఓడిపోయారు.

Duvvada-Srinivas.jpg

ఎన్నికలకు ఏడాది ముందు దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. మూలపేటలో పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనుకే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆతర్వాత కొద్దిరోజుల్లోనే దువ్వాడ శ్రీను సతీమణి దువ్వాడ వాణి కొంతమందిని వెంటబెట్టుకుని జగన్‌ను కలిశారు.


Duvvada-Daughters.jpg

ఆతర్వాత పరిణామాలతో టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా దువ్వాడ వాణిని నియమించారు. ఆతర్వాత మళ్లీ టెక్కలి సీటును శ్రీనుకు కేటాయించడంతో తాను ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేస్తున్నట్లు వాణి ప్రకటించారు. దీంతో కంగుతిన్న వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డితోపాటు మరికొంతమంది నచ్చజెప్పి.. కుటుంబ వ్యవహారాలను కొంతమేర ‘సెటిల్‌’ చేశారు. అప్పట్లో అంతర్గత ఒప్పందానికి శ్రీను కట్టుబడినట్లు సమాచారం.


Duvvada.jpg

అయితే కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరం వద్ద ఇంటిని నిర్మించుకున్నారు. అక్కడ మరో మహిళతో కలసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీను-వాణికి హైందవి, నవీన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల శ్రీను మరో మహిళతో ఉంటుండటంతో తమ సంగతేమిటో తేల్చాలంటూ కుమార్తెలు గురువారం రాత్రి ఆందోళన నిర్వహించారు. దువ్వాడ శ్రీను ఇంటిముందే కుమార్తెలు కారులో కూర్చుని చాలాసేపు ఉన్నారు. బయటి నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు. దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ల నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా.. తాజాగా అవి బయటపడ్డాయి. కుమార్తెలు అక్కడే విలేకరులతో మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు కాలేదని తెలిపారు.

Duvvada-And-Wife.jpg

Updated Date - Aug 09 , 2024 | 08:09 AM