Share News

Atchannaidu: నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్

ABN , Publish Date - Nov 08 , 2024 | 03:55 PM

Andhrapradesh: ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు లేదన్నారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు.

Atchannaidu: నీకు బుద్ధి జ్ఞానం ఉందా.. జగన్‌పై మంత్రి అచ్చెన్న ఫైర్
AP Minister Atchannaidu

శ్రీకాకుళం, నవంబర్ 8: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిప మంత్రి అచ్చెన్నాయుడు (AP Minister Atchannaidu) విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిపై కేసులు పెట్టి జగన్ (Former CM YS Jagan) పైశాచిక ఆనందం పొందారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు లేదన్నారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు.

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్..



బావ స్వేచ్ఛ అంటూ జగన్ వ్యక్తి హననానికి పాల్పడుతున్నారన్నారు. బావస్వేచ్ఛ ప్రకటన అంటూ ఆడవారిపై పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా పోస్టుల వలన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధపడ్డారన్నారు. ‘‘జన్మనిచ్చిన తల్లి, చెల్లిపై కూడా తప్పుడు పోస్టులు పెట్టిన జగన్ మనిషేనా? ఆడవారిని ఏడిపిస్తే చూస్తూ ఊరుకోం, ఖబర్దార్ జగన్!’’ అంటూ హెచ్చరించారు. ఈరోజు నుంచి ఎవరైనా మహిళలపై వ్యక్తి హననానికి పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. అధికారంలో ఉన్న లేకపోయినా తాము ప్రజా సమస్యలపై స్పందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు.


జగన్ ఎందుకు నోరు మెదరు: పార్థసారథి

parthasarathi.jpg

అప్రజాస్వామిక ప్రభుత్వం నడిపిన వాడు ప్రజాస్వామ్య విలువలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి వ్యాఖ్యలు చేశారు. తల్లీ, చెల్లిని నీచంగా విమర్శించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలని జగన్ చెప్తున్నారా అంటూ మండిపడ్డారు. మహిళల్ని అసభ్యంగా కించపరిచే వారిని సమర్థించి మద్దతిస్తానని జగన్ చెప్తున్నారా అని నిలదీవారు. సొంత తల్లీ చెల్లిపై వచ్చే విమర్శల్ని కూడా జగన్ ఎందుకు నోరు మెదపట్లేదని అడిగారు. కూటమి ప్రభుత్వంలో ఏ అధికారికి సప్తసముద్రాల అవతల దాక్కోవాల్సిన పరిస్థితి రాదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తాననుకోవటం జగన్ అవివేకమన్నారు.

PM Modi: చక్రాలు, బ్రేకుల్లేని బండికి డ్రైవర్ కోసం పోటీ


పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని జగన్ సాగించిన అరాచకం దేశమంతా చూసిందన్నారు. ప్రతిపక్షాలను హింసించటానికే జగన్ సీఐడీని వాడుకున్నారని ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీని క్రూరంగా హింసించడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. తప్పు చేసిన నేతల్ని మందలించక పోగా సమర్ధించడం జగన్ కే చెల్లింది అంటూ మంత్రి పార్థసారథి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్‌ లాంఛర్‌ లభ్యం

KA Paul: సుప్రీంకోర్టులో కేఏపాల్‌కు చుక్కెదురు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 04:00 PM