Share News

TDP: అది సంస్కృతి.. టీడీపీకి అవసరం లేదు: అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Feb 08 , 2024 | 10:45 AM

అమరావతి: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కాళ్లపై పడటం, కాళ్ళు మొక్కటం వైసీపీ సంస్కృతే కానీ తెలుగుదేశానికి ఆ అవసరం లేదన్నారు. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగనే వీటికి పాకులాడతారని నేతలు అన్నారు.

TDP: అది   సంస్కృతి.. టీడీపీకి అవసరం లేదు: అచ్చెన్నాయుడు

అమరావతి: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కాళ్లపై పడటం, కాళ్ళు మొక్కటం వైసీపీ సంస్కృతే కానీ తెలుగుదేశానికి ఆ అవసరం లేదన్నారు. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగనే వీటికి పాకులాడతారని నేతలు అన్నారు. ఈ సందర్భంగా గురువారం అమరావతిలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టమని, చంద్రబాబుపై పెట్టిన ఫేక్ పోస్టులకు సంబంధించి పోలీసులుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అయితే వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటారు కానీ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే చర్యలు ఉండవంటూ పోలీసులపై మండిపడ్డారు. అమిత్ షా పిలుపు మేరకే తమ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారన్నారు. అక్కడి పరిణామాలపై పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా, అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటుంది కానీ.. జగన్ లా వ్యక్తిగత స్వార్ధం కోసం ఉండదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

వివరాలు..

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపు మేరకు చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లారు. రాత్రి 7.30 గంటలకు భేటీ ఉంటుందని తొలుత వార్తలు వచ్చాయి. అంతే! రాత్రి 7.30 కాగానే ఫేక్‌ ప్రచారం మొదలైంది. చంద్రబాబు ఢిల్లీలో అమిత్‌ షా పాదాలకు వంగి నమస్కరిస్తున్నట్లు ఒక ఫేక్‌ ఫొటో సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. మెట్రో రైలులో ప్రధాని మోదీ ముందు చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్నట్లుగా మరో ఫొటో కూడా సృష్టించారు.

అడుగు పెట్టకముందే...

చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెట్టకముందే ఈ ఫేక్‌ ప్రచారం మొదలైంది. క్లుప్తంగా సమాచారాన్ని అందించే ‘వే2న్యూస్‌’ లోగోను దీనికి వాడుకున్నారు. ‘‘చర్చలకోసం ఢిల్లీవెళ్లిన చంద్రబాబు.. అమిత్‌షా కాళ్లు మొక్కడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి 4 పార్లమెంటు, 22 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం’’ అంటూ ఒక తప్పుడు కథ అల్లేశారు. అసలు విషయం ఏమిటంటే... బుధవారం రాత్రి పొద్దుపోయే దాకా చంద్రబాబు-అమిత్‌షా భేటీ మొదలే కాలేదు. పొత్తు సంగతీ తేలలేదు. కానీ... ఏకంగా సీట్లు, అభ్యర్థులను కూడా పేటీఎం బ్యాచ్‌ ప్రకటించేసింది. ఇది ఫేక్‌ అని, తాము ప్రచురించిన కథనం కాదని ‘వే2న్యూస్‌’ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది. ‘‘ఇది మా వార్త కాదు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు మా లోగోను వాడుకొంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి’’ అని ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలోనూ ఇదే మాదిరిగా ఈ సంస్థ లోగోతో టీడీపీ వ్యతిరేక వార్తలు పుట్టించి ప్రచారంలో పెట్టారు. అప్పుడు కూడా ‘వే2న్యూస్‌’ స్పందించి వివరణ ఇచ్చింది.

లేనిది ఉన్నట్లు...

‘అమిత్‌షా కాళ్లు మొక్కుతున్న చంద్రబాబు’... ఒక ఫేక్‌ ఫొటో, ఒక ఫేక్‌ వార్త. రెండు ఫొటోలను కలిపి మిక్సింగ్‌ చేసేశారు. 2018లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు యోగాసనాలు వేశారు. ఇందులో భాగంగా నడుమును వంచి యోగా చేశారు. ఇక... అమిత్‌షా బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్‌ జోషికి నమస్కరిస్తున్న (కొద్దిగా వంగి, ఒక చేత్తో మోకాలిని తాకడం) ఫొటోను నెట్‌లో పట్టుకున్నారు. అక్కడి చంద్రబాబు, ఇక్కడి షాను కలిపేసి... తప్పుడు ఫొటో సృష్టించారు. ఇక... మోదీ-బాబు ఫొటో కూడా ఇలాంటిదే. అప్పుడెప్పుడో మెట్రో రైలులో మోదీ యువతతో ముచ్చటిస్తున్న దృశ్యమది. అక్కడ... చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్న ఫొటోను యాడ్‌ చేశారు. ఉత్తర భారత దేశంలో ఏ మెట్రో రైలులోనూ గత నాలుగున్నరేళ్లలో మోదీతోపాటు చంద్రబాబు ప్రయాణం చేయలేదు.

Updated Date - Feb 08 , 2024 | 10:45 AM