Srisailam Temple: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. అధికారుల కీలక ప్రకటన..
ABN , Publish Date - Aug 18 , 2024 | 01:05 PM
శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనాలను నిలుపుదల చేస్తూ భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనాన్ని మాత్రమే కల్పించాలని అధికారులు నిర్ణయించారు. భక్తుల కోరిక మేరకు ఈ నెల 18, 19 తేదీలో స్వామివారి స్పర్శ దర్శనాన్ని కల్పించేందకు అధికారులు నిర్ణయించారు. ఈ రెండు రోజులు నిర్దిష్ట సమయాలలో...
శ్రీశైలం, ఆగస్టు 18: శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనాలను నిలుపుదల చేస్తూ భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనాన్ని మాత్రమే కల్పించాలని అధికారులు నిర్ణయించారు. భక్తుల కోరిక మేరకు ఈ నెల 18, 19 తేదీలో స్వామివారి స్పర్శ దర్శనాన్ని కల్పించేందకు అధికారులు నిర్ణయించారు. ఈ రెండు రోజులు నిర్దిష్ట సమయాలలో నాలుగు విడతలుగా స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు.
మొదటి విడత 6:45 నుంచి 8:30 వరకు, రెండవ విడత మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, మూడో విడత రాత్రి 8 నుంచి 9 వరకు, నాలుగో విడత రాత్రి 10 నుంచి 11:30 గంటల వరకు స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు. భక్తులు స్పర్శ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్ వెబ్‌సైట్ https://www.srisailadevasthanam.org ద్వారా గంట ముందు వరకు కూడా పొందవచ్చు. అయితే ఈ రెండు రోజులు స్వామివారి గర్భాలయ, సామూహిక ఆర్జిత అభిషేకాలు, ఆర్జిత కుంకుమార్చనలకు అవకాశం లేదు.
నిలకడగా ఇన్ ఫ్లో..
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల నుంచి 31,806 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 60,354 క్యూసెక్కులు మొత్తం 1,39,796 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 881.10 అడుగులుగా నమోదయింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీంఎసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 193.8593 టీంఎసీలుగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్ జల విద్యుత్ కేంద్రం ద్వారా 31,303 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ద్వారా 37,681 క్యూసెక్కుల మొత్తం 68,984 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.