ST Commission: వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో సీఎస్ నీరబ్ కుమార్‌కు ఎస్టీ కమిషన్ నోటీసులు..
ABN , Publish Date - Jun 25 , 2024 | 07:10 PM
గత వైసీపీ ప్రభుత్వ(YSRCP Govt) నిర్వాకంతో ప్రస్తుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(Neerabh Kumar Prasad) కు జాతీయ ఎస్టీ కమిషన్(National ST Commission) నోటీసులు జారీ చేసింది. జగన్(Jagan) ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్.. పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంపై అప్పట్లోనే జగన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ(YSRCP Govt) నిర్వాకంతో ప్రస్తుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad)కు జాతీయ ఎస్టీ కమిషన్(National ST Commission) నోటీసులు జారీ చేసింది. జగన్(Jagan) ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్.. పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంపై అప్పట్లోనే జగన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలంటూ ప్రస్తుత సీఎస్‌ను కమిషన్ ఆదేశించింది. నోటీసులు అందుకున్న 15రోజుల్లోగా తమ ఎదుట హాజరై పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.
గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యంగా చేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన విశాఖకు చెందిన న్యాయవాది రమేశ్ చంద్ర వర్మ.. పరిహారం చెల్లింపు, పునరావాసం కల్పించకపోవడంపై ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్.. వివరణ ఇవ్వాలంటూ సీఎస్ నీరబ్ కుమార్‌ను ఆదేశించింది. జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగూ ముందుకు సాగలేదు. కనీసం భూముల కోల్పోయిన వారి బాధలు కూడా పట్టించుకోలేదు. దీనిపై వారు ఎన్నిసార్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రికి మెురపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రమేశ్ చంద్రవర్మ బాధితులకు అండగా ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. నిర్వాసితులను ఆదుకోవడంపై చేపట్టిన చర్యలపై వివరణ ఇవ్వాలంటూ తాజాగా ఎస్టీ కమిషన్ సీఎస్‌ను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
Hanuma Vihari: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన క్రికెటర్ హనుమ విహారి..
AP Politics: PADAలో అవినీతిపై పులివెందుల ప్రజలు ఆలోచించాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి
Diarrhea: డయేరియా నేపథ్యంలో జగ్గయ్యపేటలో మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు పర్యటన..