Share News

TDP : ఇక అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి!

ABN , Publish Date - Jun 19 , 2024 | 03:52 AM

రాష్ట్రంలో నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అంతకుముందున్న ప్రభుత్వ పథకాల పేర్లను తీసేసింది.

TDP : ఇక అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి!

  • నాడు అంబేడ్కర్‌ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్న జగన్‌.. నేడు మళ్లీ పునరుద్ధరణ

  • ప్రక్షాళన మొదలుపెట్టిన కొత్త ప్రభుత్వం

  • వైఎస్‌, జగన్‌ పేరిట ఉన్న పథకాలకు

  • తిరిగి పాత పేర్లు పెడుతూ ఉత్తర్వులు

  • ఇక అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి!

అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అంతకుముందున్న ప్రభుత్వ పథకాల పేర్లను తీసేసింది. చివరకు షెడ్యూలు కులాల విద్యార్థుల విదేశీ విద్యను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన ‘అంబేడ‘్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి’ పథకంలోని అంబేడ్కర్‌ పేరును సైతం తొలగించింది. దానిని ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’గా మార్చివేసింది. తిరిగి అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు పేరు ప్రక్షాళనకు పూనుకుంది. ఆ పథకానికి గతంలో ఉన్న పేరునే కొనసాగిస్తూ ఆదేశాలు జారీచేసింది. నాడు జగన్‌ పలు సంక్షేమ పథకాలకు తండ్రి వైఎ్‌సఆర్‌ పేరు, తన పేరును జోడించేవారు. దీనిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలు సులభంగా తెలుసుకునేలా ఆయా పథకాల పేర్లను మార్చాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Updated Date - Jun 19 , 2024 | 10:06 AM