Mudragada: పిచ్చి లేఖలు రాయడం మానుకోండి..
ABN , Publish Date - Nov 15 , 2024 | 06:50 PM
సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ లేఖపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో ముద్రగడకు బుద్దా బహిరంగ లేఖ రాశారు.
అమరావతి, నవంబర్ 15: సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా లేఖ రాశారు. ఈ లేఖపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తనదైన శైలిలో స్పందిస్తూ.. ముద్రగడ్డకు శుక్రవారం బహిరంగ లేఖాస్త్రం సంధించారు. దయ చేసి ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి లేఖలు రాయడం మానుకోండి ‘రెడ్డి గారంటూ’.. ముద్రగడ పద్మనాభానికి బుద్దా వెంకన్న హితవు పలికారు. గౌరవమైనా దక్కుతుందని సూచించారు.
Also Read: ఆ సమస్యలను పట్టించుకోరా అని మండిపాటు
ముద్రగడకు ప్రశ్నల వర్షం..
ఎదుటి వారు బాగుంటే చూడలేని అసూయా పరులు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి నమస్కారాలంటూ బుద్ధా వెంకన్న.. ఈ లేఖను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు.. అధికారం కోసం కాకుండా ప్రజల కోసం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు రూ. 3 వేల పింఛన్.. రూ. 4 వేలు చేసిన విషయం మీకు తెలియదా రెడ్డి గారు అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇది.. మీ జగన్ రెడ్డి ఇచ్చిన హామీ రూ. 2 వేలు నుంచి రూ. 3 వేలు చేస్తానని.. వాయిదా పద్దతిలో పెంచిన విషయం మీకు తెలియదా?.. ఆ సమయంలో మీరు ఎందుకు నాటి సీఎం వైఎస్ జగన్‌కు లేక రాయలేదు?.. ఇక దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మీ వాళ్ళకి కనబడలేదా ‘రెడ్డి గారు’?.. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ సీలిండర్లు ఇవ్వడం మీకు కనబడలేదా ‘రెడ్డి గారు’? అంటూ ముద్రగడపై బుద్దా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు. అవి చూడకపోతే.. ఒక సారి యూట్యూబ్‌లో మళ్లీ చూడాలని ఆయనకు సూచించారు.
Also Read: గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం..
ఓర్వ లేక ఇలా..
ఎప్పుడు నా జాతి నా జాతి అని మాట్లాడే మీరు పవన్ కళ్యాణ్‌ని ఈ స్థాయిలో చూసే సరికి ఓర్వ లేక ఇలా మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఇక విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం సీఎం చంద్రబాబుతోపాటు కూటమి నాయకులు మీ లాగా లేఖలు రాయన్నారు. "విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు" అంటూ ఉద్యమం సాగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో స్టీల్ ప్లాంట్ అంశం మాట్లాడి.. ఎక్కడ ఎటువంటి అన్యాయం జరగకుండా యధావిధిగా ఆ సంస్థ పని చేసేలా చేస్తారని స్పష్టం చేశారు. మీరు తొందరపడి లేఖలో సున్నితమైన విషయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు అంటూ ముద్రగడకు బుద్దా సూచించారు.
Also Read: కాంగ్రెస్‌లోకి త్వరలో కారు పార్టీ ఎమ్మెల్యేలు
అలవాటు కదా..
అయినా కులాల మధ్య గొడవలు పెట్టడం మీకు అలవాటు కదా అని అన్నారు. కార్మికులకు, కూటమి ప్రభుత్వానికి గ్యాప్ తీసుకు వద్దామనే కుట్రతో ఈ లేఖ రాశారా? అని ముద్రగడను సూటిగా ప్రశ్నించారు. మరి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మీరు ఈ విశాఖ ఉక్కుపై ఎందుకు మాట్లాడ లేదంటూ సందేహం వ్యక్తం చేశారు. ఆ రోజు అక్కడికి వెళ్లి విశాఖ ఉక్కు కోసం నిరాహారదీక్ష చేస్తున్న వాళ్లకి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇవి అన్నీ మీ స్వార్ధ రాజకీయాలు కాదా? అంటూ ముద్రగడపై మండిపడ్డారు.
Also Read:: అన్మోలా మజాకా.. దీని మెనూ చూస్తే కళ్లు తేలేయాల్సిందే
నిజం కాదా?
1994లో పత్తిపాడు అసెంబ్లీకి మీరు పోటీ చేసినప్పుడు అన్ని కులాలు మీకు ఓటు వెయ్యలేదు కదా అంటూ ముద్రగడని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. 1999 లో అయ్యో పాపం అని.. కాకినాడ పార్లమెంట్ సీట్ ఇచ్చి మిమల్ని ఎం.పీని చేసింది చంద్రబాబు కాదా? అని నిలదీశారు. ఆ రోజు నేను చంద్రబాబు నాయుడుకి ఋణపడి వుంటానని మీరు స్టేట్‌మెంట్ ఇచ్చింది కూడా నిజం కాదా? అని అడిగారు. అలాంటి సీఎం చంద్రబాబునాయుడుని అసభ్య పదజాలంతో ఈ రోజు లేఖ రాయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అని నిలదీశారు.
Also Read: నల్ల నువ్వుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
ఇడుపులపాయకు..
సూపర్ సిక్స్ పథకాలన్ని కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకి అందజేస్తుందన్నారు. కానీ చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే సరికి మీ జగన్ మోహన్ రెడ్డి.. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇడుపులపాయకి పంపించారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఈ విషయం మీకు సైతం తెలుసునన్నారు.
కంటెంట్ లేని లేఖలు..
ఈ వేళ సంపదని సృష్టించి దానిని పేదవాడికి పంచడమే కాకుండా.. సీఎం చంద్రబాబుతోపాటు కూటమీలోని నేతలు ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ ద్వారా ప్రజలకు అందుతున్నాయన్నారు. దయచేసి ఇలాంటి పిచ్చి లేఖలు రాయడం మానుకోండంటూ ముద్రగడకు సూచించారు. చివరగా ‘రెడ్డి గారు’.. ఒక్క మాట.. మిమల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మీరు కంటెంట్ లేని లేఖలు రాసిన, దానికి వెంటనే కంటెంట్‌తో బదులు ఇచ్చే సమాధానం తమ వద్ద ఉందని ముద్రగడకు ఈ లేఖ ద్వారా బుద్దా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
తమకు చేతకాదు..
మీరు పార్టీలు మారినంత ఈజీగా కులం కూడా మారిపోయారని గుర్తు చేశారు. అయితే అది తమకు చేతకాదన్నారు. తమ పార్టీ తెలుగుదేశం పార్టీ.. మా కులం బి.సి కులం.. ఎప్పుడు ఒక్క ఎజెండాతోనే పని చేస్తామని ముద్రగడకు బుద్దా తన లేఖలో క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.
For AndhraPradesh News And Telugu News